‘భీష్మ’ టీజర్..నవ్వుల ఖజానా..!
యంగ్ హీరో నితిన్ కెరీర్‌కి ఇప్పుడు అర్జంట్‌గా హిట్ అవసరం. వరసగా మూడు ప్లాప్స్‌తో మరోసారి కష్టాల్లో ఉన్నాడు ఈ నైజాం కుర్రోడు. అందుకే ఈ సారి వెంకీ కుడుముల లాంటి యువ దర్శకుడితో ఓ సాలిడ్ ఎంటర్టైనర్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. పొంగల్ కానుకగా ‘భీష్మ’ టీజర్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉంది’ అంటూ తనపై తానే టీజర్‌లో సెటైర్ వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. […]
యంగ్ హీరో నితిన్ కెరీర్‌కి ఇప్పుడు అర్జంట్‌గా హిట్ అవసరం. వరసగా మూడు ప్లాప్స్‌తో మరోసారి కష్టాల్లో ఉన్నాడు ఈ నైజాం కుర్రోడు. అందుకే ఈ సారి వెంకీ కుడుముల లాంటి యువ దర్శకుడితో ఓ సాలిడ్ ఎంటర్టైనర్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. పొంగల్ కానుకగా ‘భీష్మ’ టీజర్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉంది’ అంటూ తనపై తానే టీజర్‌లో సెటైర్ వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. హీరోయిన్‌గా రష్మిక మందనా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. రఘుబాబు, బ్రహ్మజీ, వెన్నెల కిషోర్ లాంటి నటులు తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. టీజర్‌లోని మరికొన్ని కామెడీ డైలాగ్స్ కూడా అద్భుతంగా పేలాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ మూవీనిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న ‘భీష్మ’ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సరదా టీజర్‌పై మీరూ ఓ లుక్కెయ్యండి.