టాలీవుడ్ తారల డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్…

2017లో డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసింది. ఎందరో అగ్రతారలు డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరగడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు పలువురు సెలబ్రిటీలను విచారణ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు.  ఏకంగా 11 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్‌ సాగింది. ఆ విచారణలో ఏం తేలింది..? విచారణకు హాజరైన వారంతా డ్రగ్స్ తీసుకున్నారా..? ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? కేసు విచారణ ముగిసిందా..? ఇంకా సాగుతూ […]

టాలీవుడ్ తారల డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్...
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 12, 2020 | 4:11 PM

2017లో డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసింది. ఎందరో అగ్రతారలు డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరగడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు పలువురు సెలబ్రిటీలను విచారణ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు.  ఏకంగా 11 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్‌ సాగింది. ఆ విచారణలో ఏం తేలింది..? విచారణకు హాజరైన వారంతా డ్రగ్స్ తీసుకున్నారా..? ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? కేసు విచారణ ముగిసిందా..? ఇంకా సాగుతూ ఉందా..?. సమాచార హక్కు చట్టంతో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూశాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్స్‌ సప్లై చేస్తూ కెల్విన్‌ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఖాకీలు తమదైన స్టైల్లో విచారించేటప్పటికీ తనకున్న లింకులన్నీ బయటపెట్టాడు. అతని ఫోన్‌లో సినీ ప్రముఖుల నెంబర్లన్నీ ఉన్నాయి. మొత్తం 62 మంది ప్రముఖుల పేర్లను అధికారులు బయటకు తీశారు. అందులో 11 మంది సినిమా స్టార్స్ ఉన్నారు. వారందరినీ విచారణకు పిలిచారు. అందులో డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరో రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, నందు, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌, చిన్నా, చార్మీ, ముమైత్‌ ఖాన్‌ ఉన్నారు. వీరిందరికీ నోటీసులు ఇచ్చి మరీ… రొజుకొకరు చొప్పున 11 రోజుల పాటు అందరినీ విచారించారు. నిందుతుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకుల నమూనాలను సేకరించారు. ఈ కేసులో ఎవ్వరినీ వదలి పెట్టేది లేదని అప్పట్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు బలంగా చెప్పారు.

దాదాపు ఓ నెల పాటు అప్పట్లో విచారణల పేరుతో హడావుడి జరిగింది. ఆ తర్వాత అంతా కామైపోయారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ డ్రగ్స్‌ కేసులో నిందుతులెవరు ? సాక్ష్యులెవరు ? దోషులెవరు ? అన్నది తేల్చ లేకపోయారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. రీసెంట్‌గా ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సేకరించారు. ఇందులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి.

డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి… సినీనటులు, దర్శకులు, సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. సినీ ప్రముఖులను విచారించి, వారి నుంచి శాంపిల్స్‌ సేకరించిన అధికారులు… వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే నిందితులందరినీ బాధితులుగా పేర్కొన్నారు. దీనిపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ సీఎస్‌కు ఫిర్యాదు కూడా చేసింది.