- Telugu News Photo Gallery Technology photos Here are the features and price details of the Poco C85 5G phone that was recently launched in India
5G Smart Phone: ఏం ఫోన్ భయ్యా ఇది.. కేవలం రూ.12 వేలకే లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది..
Poco C85 5G: పోకో మరో సరికొత్త 5జీ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ డిసెంబర్ 16 నుంచి సేల్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర అత్యంత తక్కువగా ఉంది.
Updated on: Dec 10, 2025 | 6:44 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో తాజాగా లాంచ్ చేసింది. సీ సీరిస్ వెర్షన్లలో భాగంగా పోకోసీ 85 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పెద్ద డిస్‌ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ గంటలపాటు మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో పాటు అనేక అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత తక్కువ ధరకే ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రూపొందించారు. 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇక 106 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్డు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ బేస్ వేరియెంట్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ప్రారంభ ధర రూ.11,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.12,999గా ఉండగా.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర రూ. 14,499గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆఫ్షన్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, QVGA కెమెరా ఉన్నాయి. ఇక 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.2పై ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండుసార్లు ఆండ్రాయడ్ అప్‌గ్రేడ్, నాలుగు సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందించనుంది.

ఈ ఫోన్‌కు ఐపీ 64 రేటింగ్ ఉంది. అంటే మీ ఫోన్‌ను దుమ్ము, వాటర్ నుంచి రక్షిస్తుంది. ఇక 8జీబీ వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో మీరు దీనిని విస్తరించుకోవచ్చు.




