వైకుంఠపురములో ‘బంక్ శీను’ 2.0 అట… 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటిని అందుకుంటూ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గురూజీ మార్క్ పంచ్ డైలాగులతో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్‌తో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో హీరో సునీల్ రోల్ హైలైట్‌గా […]

వైకుంఠపురములో 'బంక్ శీను' 2.0 అట... 
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 12, 2020 | 8:52 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాటిని అందుకుంటూ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గురూజీ మార్క్ పంచ్ డైలాగులతో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్‌తో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో హీరో సునీల్ రోల్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

బంతి- బంక్ శీను- నీలాంబరి వంటి పాత్రలను తన గత చిత్రాల్లో సునీల్‌కు ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన త్రివిక్రమ్ ఈసారి సీతారామ్ అనే పాత్ర ద్వారా సునీల్‌ను సరికొత్తగా చూపించారట. ఈ సినిమాకు సీతారామ్ పంచ్‌లు హైలైట్‌గా నిలుస్తాయని టాక్. ‘అమృతం’ హర్షవర్ధన్- సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయని తెలుస్తోంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే సునీల్ ఇందులో బంక్ శీను 2.0 క్యారెక్టర్ చేశాడన్న మాట. ఇక సీనియర్ యాక్టర్స్ మురళీ శర్మ, జయరామ్, టబుల పాత్రలు కథలో చాలా కీలకమని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని బన్నీ కూడా రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి విదితమే.

సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ గ్లామర్ అదనపు ఆకర్షణ. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మించారు.