ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ సీరియస్..

సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప, కులాల ప్రస్తావన ఎందుకని సీఎం మందలించినట్టు తెలుస్తోంది. రైతులపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం. ఇంకెప్పడూ కులాలను ప్రస్తావించొద్దని, ఏ వర్గాన్ని కించపరచొద్దని సీఎం నుంచి పార్టీ నాయకులకు ఆదేశాలు అందాయి. సీఎం వార్నింగ్ నేపథ్యంలో పృథ్వీ వెనక్కి […]

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ సీరియస్..
Follow us

|

Updated on: Jan 12, 2020 | 2:07 PM

సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప, కులాల ప్రస్తావన ఎందుకని సీఎం మందలించినట్టు తెలుస్తోంది. రైతులపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం. ఇంకెప్పడూ కులాలను ప్రస్తావించొద్దని, ఏ వర్గాన్ని కించపరచొద్దని సీఎం నుంచి పార్టీ నాయకులకు ఆదేశాలు అందాయి.

సీఎం వార్నింగ్ నేపథ్యంలో పృథ్వీ వెనక్కి తగ్గారు. రైతుల గురించి ఎప్పడూ తప్పుగా మాట్లాడలేదని, ఇంకెప్పుడు మాట్లాడనని స్పష్టం చేశారు. తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని చెప్పిన పృథ్వీ, రైతులంటే ఇష్టమని పేర్కొన్నారు. తాను కడుపుకి రైతుల పండించిన అన్నం తింటున్నానని, గడ్డి తినడంలేదని తెలిపారు. రైతుల ముసుగులో బినామీలు చేస్తున్న దౌర్జన్యం మీద మాట్లాడను తప్ప, ఎవ్వరిని  కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ విషయం రైతు సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు పృథ్వీ.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.