UPI Services: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు యూపీఐ సేవలు బంద్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. రెండు రోజుల పాటు ఆ బ్యాంక్ యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. మెయింటనెన్స్ కారణంగా రెండు రోజులు సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది,.

దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ సేవలు అంతరాయంగా కారణంగా నిలిచిపోనున్నాయి. మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. 13వ తేదీ కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. 13వ తేదీ ఉదయం 2.30 గంటల నుంచి 6.30 గంటల వరకు మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయని వెల్లడించింది. ఇక డిసెంబర్ 21న ఉదయం 2.30 గంటల నుంచి 6.30 గంటటల వరకు నిలిచిపోనున్నాయి. మెయింటనెన్స్ కారణంగా సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.
అకౌంట్స్, డిపాజిట్, యూపీఐ, నెఫ్ట్, ఐఎమ్‌పీఎస్, ఆర్టీజీఎస్, ఆన్‌లైన్ పేమెంట్స్, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్లు దీనిని గమనించాల్సిందిగా సూచించింది. ఈ సమయంలో పేజెడ్ వ్యాలెట్‌ను నగదు బదిలీకి ఉపయోగించుకోవాలని సూచించింది. మిగిలిన రోజుల్లో యధావిధంగా పనిచేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా యూపీఐ సేవలు నిలిచిపోతున్నాయి. మీరు వివిధ యాప్స్‌లలో లింక్ చేసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ల నుంచి యూపీఐ సేవలు పొందలేరు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ జారీ చేసి రూపే కార్డులతో కూడా యూపీఐ సేవలు పొందలేరు.
