AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. ఆమె నేరాల చిట్ట చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. నెల్లూరుజిల్లాకు చెందిన లేడీడాన్‌ అరుణను ఎట్టకేలకు పోలీసు పట్టుకున్నారు. ఆమెపై పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ నమోదు చేశారు. రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌తో పాటు, పలు సెటిల్మెంట్‌ దందాల్లో అరుణ పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆమె నేరాల చిట్టాను బయటపెట్టారు. దీంతో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు పోలీసులు.

Andhra News: లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. ఆమె నేరాల చిట్ట చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!
Lady Don Aruna
Ch Murali
| Edited By: |

Updated on: Dec 12, 2025 | 10:34 PM

Share

లేడీ డాన్ అరుణ వ్యవహారంపై అనుమానం రావడంతో లోతైన విచారణ జరిపారు పోలీసులు. ఆమె ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ వారినే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగినట్టు గుర్తించారు.  ఇవే కాకుండా పలు సెటిల్మెంట్‌ వ్యవహారాల్లో కూడా ఈమె పాల్గొన్నట్టు గుర్తించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడం.. బయటకు వచ్చిన సందర్భంలో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెరోల్ వచ్చిన నాలుగు రోజుల్లోనే రద్దు చేసి తిరిగి జైలుకు పంపారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అరుణను అరెస్ట్ చేసి లోతుగా విచారణ జరపడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు సెటిల్మెంట్‌కు పాల్పడినట్టు గుర్తించారు. వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తిని గంజాయి, వ్యభిచార గృహాలు నడపాలని డిమాండ్ చేసినట్లు బాధితుడి ఫిర్యాదు ద్వారా తెలుసుకున్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేతో అరుణ సన్నిహితంగా మెలిగినట్లు కొన్ని వీడియోలు కూడా వైరల్‌ అయినట్టు పోలీసులు కనిపెట్టారని తెలుస్తోంది. అయితే  రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో అరుణ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆమెను నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

రిపీటెడ్‌గా నేరాలు చేస్తున్న రౌడీ షీటర్ల పై కఠినంగా వ్యవహరిస్తున్న SP అజిత.. కోవూరు, నవాబ్ పేట, వేదయాపాలెం పీఎస్ లలో ఇప్పటికే అరుణ పై కేసులు నమోదు కాగా పిడి యాక్ట్ ప్రయోగించారు. అరుణ బయటికి వస్తె నేరాల్లో ఇన్వాల్ అయ్యే చాన్స్ ఉండటంతో ఆమె పై పీడియాక్ట్ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాల పాల్పడితే వారిపై పీడియాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. పీడియాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరి కావడంతో ఆమె నేరాలకు బ్రేక్ వేసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.