AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddharth: ”ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు”.. ఫేక్ న్యూస్ పై రియాక్ట్ అయిన హీరో నిఖిల్

కుర్ర హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ మైలేజ్ ను మరింత పెంచుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరోలు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు.

Nikhil Siddharth: ''ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు''.. ఫేక్ న్యూస్ పై రియాక్ట్ అయిన హీరో నిఖిల్
Nikhil
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2022 | 3:29 PM

Share

కుర్ర హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ మైలేజ్ ను మరింత పెంచుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరోలు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నిఖిల్(Nikhil Siddharth) కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నాడు నిఖిల్ ఈ క్రమంలోనే స్వామి రారా..!, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.? , అర్జున్ సురవరం వంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించాడు. ఇక ఇప్పుడు కార్తికేయ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కుర్ర హీరో.చందుమొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ హీరోగారు సినిమా కథల విషయంలో వేలు పెడతారని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతోంది.కథలో నిఖిల్ ఇన్వాల్వ్ అవుతారని, కథలో చాలా మార్పులు చేస్తుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు ఆ చెవిన ఈ చెవిన పడి చివరకు నిఖిల్ దగ్గరకు చేరాయి. దాంతో ఈ విషయం పై స్పందించాడు నిఖిల్. తన గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ అవాస్తవాలు అని తేల్చి చెప్పాడు. ఎవరో కావాలని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నాడు నిఖిల్.  కథ విని ఒక్కసారి ఫైనల్ అయిన తర్వాత ఎవరైనా జోక్యం చేసుకుంటే తాను సహించనని.. అలా చేస్తే తనకు కోపం వస్తుందని చెప్పుకొచ్చారు నిఖిల్.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి