Karthikeya 2 Movie: పాన్ ఇండియా పై మోజుపడుతున్న కుర్ర హీరో.. నిఖిల్ కార్తికేయ 2 కూడా
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ముందుగవరసలో ఉండే వారిలో నిఖిల్ ఒకరు. హ్యాపీడేస్ సినిమాతో క్లిక్ అయిన నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ముందువరసలో ఉండే వారిలో నిఖిల్(Nikhil Siddhartha) ఒకరు. హ్యాపీడేస్ సినిమాతో క్లిక్ అయిన నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. సోలో హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా.. అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్(18 Pages). న్యూ యేజ్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే స్పై అనే పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు నిఖిల్. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా `గూడచారి ఎవరు హిట్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న కార్తికేయ 2 లోనూ నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు కార్తికేయ 2 సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి పార్ట్ సూపర్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘కార్తికేయ 2’ పై కూడా భారీ అంచనాలున్నాయి. జూలై 22న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘కార్తికేయ 2’ కూడా అక్కడ అనూహ్య విజయాన్ని సాధించడం ఖాయం అని ఆ నమ్మకంతోనే బాలీవుడ్లో విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :