AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నాగార్జున పిటిషన్ పై కొండా సురేఖ కౌంటర్.. నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. తాజాగా నాగార్జున పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు కొండా సురేఖ.

Nagarjuna: నాగార్జున పిటిషన్ పై కొండా సురేఖ కౌంటర్.. నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..
Konda Surekha, Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2024 | 1:08 PM

Share

సినీనటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ మంత్రి కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుపై నాంపల్లి కోర్డులో విచారణ జరిగింది. నాగార్జునతోపాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నాగార్జునతోపాటు సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. తాజాగా నాగార్జున పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేశారు మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది. ఈరోజు కొండా సురేఖ కౌంటర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరగనుంది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ నాగార్జున పిటిషన్ పై విచారణ ప్రారంభమయ్యింది. కొండ సురేఖ కౌంటర్ పై వాదనలు జరగుతున్నాయి.

నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆయన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. కొండ సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున అడ్వకేట్ అన్నారు. దీంతో తనపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్ కు నాంపల్లి స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు కొండా సురేఖ. ఈరోజు కోర్టు మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది గురుమిత్ సింగ్ వాదనలను విననున్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే నాగార్జునకు మాజీ మంత్రి కేటీఆర్ ఓ కండిషన్ పెట్టారని.. అందుకే నాగచైతన్య, సమంత మధ్య విడాకులు జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతొ కొండా సురేఖ కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడ్డారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కొండా సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.