AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: ఏముందీ భయ్యా పాట.. యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. 4 కోట్ల వ్యూస్‏తో దుమ్మురేపుతుంది..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఫోక్ సాంగ్స్ ఏలేస్తున్నాయి. పల్లెటూరి మట్టి వాసన, వాతావరణాన్ని అచ్చమైన తెలుగు భాషలో, జనాలకు సులభంగా అర్థమయ్యేలా ఈ పాటలు ఉండడంతో.. ఫోక్ సాంగ్స్ చూసేవారి సంఖ్య రోజు రోజూకీ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక ఫోక్ సాంగ్ దాదాపు మూడేళ్లుగా యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.

Folk Song: ఏముందీ భయ్యా పాట.. యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. 4 కోట్ల వ్యూస్‏తో దుమ్మురేపుతుంది..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2026 | 2:26 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాయో చెప్పక్కర్లేదు. వారం వారం కొత్త కొత్త పాటలు విడుదలవుతున్నాయి. మరోవైపు సంవత్సరాలు గడిచినప్పటికీ కొన్ని సాంగ్స్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట విడుదలై దాదాపు మూడేళ్లు పూర్తవుతుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ సాంగ్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 47 మిలియన్ వ్యూస్.. అంటే దాదాపు 4 .7 కోట్ల వ్యూస్ అందుకుంది. ఈ పాటకు చిన్నా, పెద్దా అందరూ తమదైన స్టైల్లో డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. ఆ సాంగ్ పేరు తేరి మేరి కథ. సముద్ర తీరప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాట, శ్రోతలను, ప్రేక్షకులను అద్భుతమైన సంగీతంతో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట కేవలం ఒక మెలోడీ గీతం మాత్రమే కాదు. ఇందులో ఒక ఆసక్తికరమైన ప్రేమ , త్యాగం కలగలిసిన కథ ఉంది. పూడిమడక సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఈ కథలో నాయకుడి ప్రేమ, స్నేహం, బాధ్యతల మధ్య నడిచే భావోద్వేగాలు హృదయానికి హత్తుకుంటాయి. అనుకోకుండా ఎదురయ్యే మలుపులు, చివరికి మిగిలే నిశ్శబ్ద వేదన ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ ఈ పాటకి రచన, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించారు. అలాగే టోనీ కిక్, పూజా నాగేశ్వర్ , లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. కల్యాణ్ కీస్ అందించిన మ్యూజిక్ కట్టి పడేస్తుంది. ఇక సింగర్ రామ్ అద్నాన్ తన గాత్రంతో పాటలోని వేదనను అద్భుతంగా పలికించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

విడుదలైన తక్కువ సమయంలోనే ఈ పాట కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ సాంగ్ ఇప్పుడు ఫోక్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలు, నాణ్యమైన మేకింగ్ , విజువల్స్ దీని విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని చెప్పొచ్చు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఫోక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us