AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ (Ramcharan) ఓ కీలక పాత్రలో నటించాడు.

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?
Acharya Movie
Basha Shek
|

Updated on: Apr 30, 2022 | 11:42 AM

Share

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ (Ramcharan) ఓ కీలక పాత్రలో నటించాడు. శుక్రవారం (ఏప్రిల్‌29)న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను జోడించి కొరటాల శివ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఇందులో టెంపుల్‌టౌన్‌ సెట్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చిరంజీవి, చెర్రీలను ఒకే స్ర్కీన్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాగా ఈ సినిమాలో కనిపించిన ఓ ఛైల్డ్‌ ఆర్టిస్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి పేరు మిథున్‌ శ్రేయాష్‌. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి (Mandamarri) కి చెందిన డాక్టర్‌ సదానందం కుమారుడు శ్రీధర్‌, సరిత దంపతుల కుమారడే ఈ మిథున్‌. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్‌ సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.

కాగా మెగాస్టర్‌ చిరంజీవి సినిమాలో తన మనవడు నటించడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు డాక్టర్‌ సదానందం. ‘ఆచార్య సినిమాలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ కోసం వెతుకుతున్నారని శ్రీధర్‌ మిత్రుడు విజయ్‌కుమార్‌ మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు తెలిసిన వారి ద్వారా మా మనవడిని సినిమా వాళ్లకి పరిచయం చేశాం. ఆడిషన్‌లో బాగా డైలాగ్‌లు బాగా చెప్పడంతో సినిమాకు ఎంపిక చేశారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. చిరంజీవి సినిమాలో నా మనవడు నటించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని సదానందం చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భాగమైనందుకు గాను పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మిథున్‌ని అభినందించారు. కాగా ఆచార్య సినిమాలో పూజాహెగ్డే ఓ కీలక పాత్రలో నటించింది. మణిశర్మ అందించిన పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..

Reliance Jio: ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు మైదానంలో చిచ్చరపిడుగు.. బ్యాటింగ్‌కు దిగితే బ్రేకుల్లేని బుల్డోజరే..