AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..

సమాజంలో మనుషుల రూపంలో ఉన్న కొన్ని మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. వావి వరసలు మరచి, చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఆడపిల్లలపై ఆకృత్యాలకు

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..
rape case
Basha Shek
|

Updated on: Apr 30, 2022 | 10:55 AM

Share

సమాజంలో మనుషుల రూపంలో ఉన్న కొన్ని మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. వావి వరసలు మరచి, చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఆడపిల్లలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. తండ్రి కూతురిపై, సోదరుడు సోదరిపై..ఇలా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఈక్రమంలో ఓ కీచకుడు మహిళతో సహజీనం చేస్తూనే ఆమె కుమార్తైపై కన్నేశాడు. పది నెలలుగా అత్యాచారం జరిపాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. నిందితుడు సురేష్‌ ట్యాక్సీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆమె కుమార్తెపై కూడా నిందితుడి కన్ను పడింది. వరుసకు తండ్రి అవుతానన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. సుమారు పది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది.

కాగా బాలిక గర్భం దాల్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు కుటుంబీకులు. ఆస్పత్రిలో చేర్పించగా ఆ బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Reliance Jio: ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు మైదానంలో చిచ్చరపిడుగు.. బ్యాటింగ్‌కు దిగితే బ్రేకుల్లేని బుల్డోజరే..

Solar Eclipse 2022: నేడు సూర్య గ్రహణం.. శని సంచారంతో ఈ రాశుల వారికి పండగే పండగ..