Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు మైదానంలో చిచ్చరపిడుగు.. బ్యాటింగ్‌కు దిగితే బ్రేకుల్లేని బుల్డోజరే..

ఈ ఫొటోలో తండ్రి ఒడిలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ స్టార్‌ క్రికెటర్‌. అతను మైదానంలో దిగాడంటే పరుగుల వరదే. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడంలో ముందుండే అతనెవరో గుర్తుపట్టండి.

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు మైదానంలో చిచ్చరపిడుగు.. బ్యాటింగ్‌కు దిగితే బ్రేకుల్లేని బుల్డోజరే..
Viral Photo
Follow us
Basha Shek

|

Updated on: Apr 30, 2022 | 9:07 AM

Indian Cricket Team: ప్రస్తుతం సెలబ్రిటీల చైల్డ్‌ హుడ్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా సినీతారలు, క్రికెట్‌ స్టార్ల చిన్ననాటి ఫొటోలు క్షణాల్లోనే ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా ఇదే కోవలో ఓ స్టార్‌ క్రికెటర్‌ చిన్ననాటి ఫొటో ట్రెండ్ అవుతోంది. టీమిండియా తరఫున మైదానంలోకి దిగిన అతను పరుగుల వరద పాటించాడు. టీ20, వన్డే, టెస్ట్‌ అయినా మెరుపువేగంతో బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. ఈక్రమంలోనే వన్డేల్లో అత్యధిక స్కోరుతో పాటు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. అతని సామర్థ్యంపై నమ్మకముంచే బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ అతనిని టీమిండియా సారథిగా బాధ్యతలు అప్పగించింది. ఇలా ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత జట్టుకు విజయాలు అందిస్తోన్న ఈ స్టార్‌ క్రికెటర్‌ మరెవరో కాదు.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma).

మూడు ఫార్మాట్లలోనూ..

నేటి (ఏప్రిల్‌30)తో 34వసంతంలోకి అడుగుపెడుతున్నాడు రోహిత్‌ శర్మ. 2007లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రముఖుల ప్రశంసలు పొందాడు. అయితే కెరీర్‌ ఆరంభంలో నిలకడలేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. జట్టులోకి వస్తూ పోతూ ఉండిపోయాడు. అయితే ఎప్పుడైతే ఓపెనర్‌గా అవతారమెత్తాడో అప్పుటి నుంచి నిలకడగా పరుగులు సాధిస్తున్నాడీ డ్యాషింగ్ క్రికెటర్‌. ఈక్రమంలోనే పరుగుల పరంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) అతని పేరు మీదనే ఉంది. ఇక వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా ఇతనే. కెరీర్‌ మొదట్లో టెస్ట్‌ క్రికెట్‌కు పనికిరాడన్న విమర్శలు వచ్చినప్పటికీ లోపాలు సరిద్దుకుని మూడు ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణించడం మొదలుపెట్టాడు. అతని సామర్థ్యంపై నమ్మకముంచిన బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌నే టీమిండియా కెప్టెన్‌గా నియమించింది. ఈక్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ మరిన్ని రికార్డులు సాధించాలని, టీమిండియాకు అద్భుత విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

హ్యాపీ బర్త్‌ డే హిట్‌మ్యాన్‌..

మరిన్ని క్రికెట్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Solar Eclipse 2022: నేడు సూర్య గ్రహణం.. శని సంచారంతో ఈ రాశుల వారికి పండగే పండగ..

Gopichand: షూటింగ్‌లో గాయపడిన గోపీచంద్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌.. చిత్రబృందం ఏమందంటే..

Work From Any Where: ఆ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్‌.. ప్రపంచంలో ఎక్కడినుంచైనా పనిచేయచ్చు.. జీతాలపై నో ఎఫెక్ట్‌..