IPL 2022, Purple Cap: యుజ్వేంద్ర చాహల్ నెంబర్ వన్.. టాప్ 5లో పంజాబ్-రాజస్థాన్ బౌలర్లు ఎవరూ లేరు..!
IPL 2022, Purple Cap: ఐపీఎల్ 2022 లీగ్ రౌండ్ రెండో దశ ప్రారంభమైంది. ఇప్పుడు జట్లకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. ప్రతి మ్యాచ్‌కు పాయింట్ల
IPL 2022, Purple Cap: ఐపీఎల్ 2022 లీగ్ రౌండ్ రెండో దశ ప్రారంభమైంది. ఇప్పుడు జట్లకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. ప్రతి మ్యాచ్‌కు పాయింట్ల పట్టికలో లెక్కలు మారిపోతాయి. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసు కూడా ఆసక్తికరంగా మారుతుంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని వారాలుగా పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కూడా చాహల్ నెంబర్ వన్‌లోనే కొనసాగుతున్నాడు. వాస్తవానికి పర్పుల్ క్యాప్‌ను అందుకోవాలనేది ప్రతి బౌలర్ కల. లీగ్ ముగింపులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి తలపై పర్పుల్ క్యాప్‌ని అలంకరిస్తారు. ఇది కాకుండా ప్రతి మ్యాచ్ తర్వాత అగ్రస్థానంలో ఉన్న బౌలర్ ఈ టోపీని ధరించి మైదానంలో నడుస్తాడు.
పంజాబ్-లక్నో నుంచి ఏ బౌలర్ టాప్‌లో లేరు
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున రబడ నాలుగు, రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీశారు. అయితే ఈ ఇద్దరు బౌలర్లు పర్పుల్ క్యాప్ రేసులో దిగువన ఉన్నారు. రబడ ఇప్పుడు 15వ స్థానంలో, రాహుల్ చాహర్ 14వ స్థానంలో ఉన్నారు. మొహ్సిన్ ఖాన్ లక్నో నుంచి గరిష్టంగా 3 వికెట్లు తీసుకున్నాడు. రెండు జట్ల నుంచి ఏ బౌలర్ కూడా టాప్ 5లో చేరలేదు. ప్రస్తుతం 8 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టిన రాజస్థాన్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ లీగ్‌లో చాహల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు. గత కొన్ని రోజులుగా నిలకడగా నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. చాహల్ ఆధిక్యం చెక్కుచెదరకుండా ఉంది. గత సీజన్‌లో హర్షల్ పటేల్ 15 మ్యాచ్‌లలో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్‌లో డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. అయితే ఈ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు మాత్రమే తీశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి