Reliance Jio: ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..

Jio Postpaid Plans: వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ సేవలు,

Reliance Jio:  ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఈ జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లు మీకోసమే..
JIo Postpaid Plans
Follow us
Basha Shek

|

Updated on: Apr 30, 2022 | 9:55 AM

Jio Postpaid Plans: వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ సేవలు, లైవ్‌ క్రికెట్‌ సేవల కోసం అతి తక్కువ ధరలకే ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance JIO) అన్ని టెలికాం కంపెనీల కంటే ముందుంది. తన కస్టమర్ల కోసం రోజు రోజుకి సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్‌ యూజర్ల అత్యంత ఆకర్షణీయమైన ప్లాన్‌లను అతి తక్కువ ధరలకే ప్రవేశపెడుతోంది. రూ.199 మొదలుకొని వివిధ రకాల ఓటీటీలతో కూడిన పలు రకాల పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి జియో అందిస్తోన్న కొన్ని ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై ఓ లుక్కేయండి..

*రిలయెన్స్‌జియో అందిస్తున్న పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో రూ.199లతో వస్తున్న ప్యాక్‌ అత్యంత చౌకైన ప్లాన్‌. దీంట్లో ఒకనెల కాలపరిమితితో 25 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. జియో మ్యూజిక్‌, జియోటీవీ, జియో సినిమాస్‌, జియో మార్ట్‌ వంటి వివిధ జియో యాప్‌లను వినియోగించుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉండదు.

* రూ.199 ప్లాన్‌ తప్ప మిగతా అన్ని జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలోనూ అదనంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుంది. రూ.399తో నెలకు 75 జీబీ డేటా, తర్వాత ప్రతి 1జీబీకి రూ.10 చెల్లించాలి. ఈ ప్యాక్‌లో 200 జీబీ డేటా రోల్‌ఓవర్‌ సదుపాయం కూడా అంటుంది. అంటే ఈ నెలలో ఖర్చుకాని డేటా వచ్చే నెలకు ట్రాన్స ఫర్‌ చేసుకోవచ్చు. ఇక అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్రిప్షన్‌ సదుపాయం లభిస్తుంది.

* రూ.599 రీఛార్జి ప్లాన్‌లో నెలకు 100 జీబీ డేటా, 200 జీబీ రోల్‌ ఓవర్‌ అందిస్తోంది. 100 జీబీ వినియోగం తర్వాత ప్రతి 1 జీబీకి రూ.10 చెల్లించాలి. అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్రిప్షన్లను పొందవచ్చు. ఒక అదనపు జియో సిమ్‌ను కూడా పొందవచ్చు.

* రూ.799 ప్లాన్‌లో నెలకు 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్‌ఓవర్‌ అందుబాటులో ఉన్నాయి. 150జీబీ తర్వాత రూ.10 చెల్లించి 1 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌,ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్రిప్షన్లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా రెండు అదనపు జియో సిమ్‌లు పొందవచ్చు.

*రూ.999తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు.. నెలకు 200 జీబీ డేటా వస్తుంది. 500 జీబీ డేటా రోల్‌ఓవర్‌ కూడా ఉంది. 200 జీబీ డేటా ఖర్చయిన తర్వాత రూ.10 చెల్లించి ఒక్క జీబీ డేటా పొందొచ్చు. అదనంగా ఫ్యామిలీ ప్యాక్‌తో కూడిన మూడు సిమ్‌లను అందిస్తారు.

*ఇక జియోలో అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ రూ.1499 ప్యాక్‌. దీంట్లో అపరిమిత కాల్స్‌, మెసేజ్‌లతో పాటు నెలకు 300 జీబీ డేటా వస్తుంది. 500 జీబీ డేటా రోల్‌ఓవర్‌ కూడా ఉంది. అదేవిధంగా అమెరికా, దుబాయిలో ఉండేవారితో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నేషనల్‌ కాల్స్‌ మాట్లాడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు మైదానంలో చిచ్చరపిడుగు.. బ్యాటింగ్‌కు దిగితే బ్రేకుల్లేని బుల్డోజరే..

Solar Eclipse 2022: నేడు సూర్య గ్రహణం.. శని సంచారంతో ఈ రాశుల వారికి పండగే పండగ..

Work From Any Where: ఆ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్‌.. ప్రపంచంలో ఎక్కడినుంచైనా పనిచేయచ్చు.. జీతాలపై నో ఎఫెక్ట్‌..