CNG Price Hike: పెరిగిన సీఎన్‌జీ గ్యాస్‌ ధర.. కిలోకు రూ.4 పెంచుతూ నిర్ణయం..!

CNG Price Hike: సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా దేశంలో CNG ధరలను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ముంబై, పరిసర ప్రాంతాల్లో ప్రజలు CNG కోసం..

CNG Price Hike: పెరిగిన సీఎన్‌జీ గ్యాస్‌ ధర.. కిలోకు రూ.4 పెంచుతూ నిర్ణయం..!
Follow us

|

Updated on: Apr 30, 2022 | 9:39 AM

CNG Price Hike: సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా దేశంలో CNG ధరలను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ముంబై, పరిసర ప్రాంతాల్లో ప్రజలు CNG కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (MGL) శుక్రవారం సిఎన్‌జి ధరలను కిలోకు రూ.4 పెంచుతున్నట్లు ప్రకటించింది. సహజ వాయువు ధరలు 110 శాతం పెరగడం వల్ల CNG ధరలు పెరిగాయి. ఏప్రిల్ 6 నుంచి సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి. MGL ప్రకారం.. ఈ అర్ధరాత్రి నుండి ముంబై, దాని పరిసర ప్రాంతాలలో CNG ధర కిలో రూ. 76 కి పెరుగుతుంది. MGL ముంబై, థానే, మీరా-భయాందర్, నవీ ముంబై, పరిసర ప్రాంతాలకు CNG సరఫరా చేస్తుంది.

ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా సరఫరా చేసే గ్యాస్ ధరలను ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 110 శాతం పెంచింది. సహజ వాయువును కంప్రెస్ చేసినప్పుడు అది వాహనాలను నడపడానికి ఉపయోగించే CNGగా మారుతుంది. అదే సమయంలో ఇది వంట గ్యాస్‌లో కూడా ఉపయోగించబడుతుంది. ఎంజీఎల్‌ కొనుగోలు చేసిన గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగాయని తన ప్రకటనలో పేర్కొంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సీఎన్‌జీ రేట్లు పెంచుతున్నారు. అయితే, ధరలు పెరిగిన తర్వాత కూడా పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ 57 శాతం, డీజిల్‌తో పోలిస్తే 27 శాతం చౌకగా ఉందని ఎంజీఎల్‌ తెలిపింది.

మహారాష్ట్రలోని పూణెలో ఈరోజే సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.2.20 పెరిగింది. పెరిగిన సీఎన్‌జీ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు పూణేలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.77.20. ఏప్రిల్ నెలలో సహజ వాయువు ధరలో చాలా అస్థిరత ఉంది. గతంలో ప్రభుత్వం సహజవాయువుపై వ్యాట్‌ను 13 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. కొత్త వ్యాట్ రేటు 1 ఏప్రిల్ 2022 నుండి అమలు చేయబడింది. వ్యాట్ మినహాయించడంతో పూణెలో సీఎన్‌జీ గ్యాస్ ధర కిలో రూ.62కి తగ్గింది. కేవలం వారం రోజుల్లోనే ధరల పెంపు ప్రారంభించగా, ఇప్పటివరకు ఏప్రిల్‌లో రూ.15కు పైగా ధర పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..

SBI: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీల సురక్షితం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక మార్గదర్శకాలు!

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!