AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Petrol-Diesel Price: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరట కల్పిస్తున్నాయి. చమురు కంపెనీలు చివరిసారిగా ఏప్రిల్‌ 6వ తేదీన లీటర్‌కు 80 పైసల చొప్పున పెరిగాయి..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!
Subhash Goud
|

Updated on: Apr 30, 2022 | 10:31 AM

Share

Petrol-Diesel Price: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరట కల్పిస్తున్నాయి. చమురు కంపెనీలు చివరిసారిగా ఏప్రిల్‌ 6వ తేదీన లీటర్‌కు 80 పైసల చొప్పున పెరిగాయి. ఇక తాజాగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (IOC)లు శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విడుదల చేశాయి. వరుసగా 24వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి కంపెనీలు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇంకా బ్యారల్ 100 డాలర్ల పైనే ఉంది. మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గా, లీటరు డీజిల్ ధర రూ.105.49 పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్నంలో ధరలలో మార్పు చోటు చేసుకుంది. లీటరు పెట్రోల్ ధర రూ.120 నుంచి రూ.120.87కు పెరిగింది. అలాగే లీటరు డీజిల్ ధర రూ.105.65 నుంచి రూ.106.46కు ఎగిసింది. ఏపీలో చాలా ప్రాంతాలలో ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.

అటు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41 వద్ద పలుకుతోంది. డీజిల్ రేటు లీటరు రూ.96.67గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.120 పైన ఉంది. డీజిల్ రేటు రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.83గా నమోదవుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.85 ఉండగా, డీజిల్‌ ధర రూ.100.94 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్‌పై విధిస్తోన్న పన్నుల విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. విపక్ష పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లను తగ్గించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. ఆ మేర వ్యాట్‌లను మాత్రం తగ్గించడం లేదని కేంద్రం చెబుతోంది. కాగా, అంతర్జాతీయ రేట్ల ప్రకారం.. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షిస్తాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అయితే ఈ ధరలలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌లు కలిసి ఉంటాయి. వ్యాట్‌లను ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా విధిస్తోంది. దీంతో ధరలలో మార్పు ఉంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

CNG Price Hike: పెరిగిన సీఎన్‌జీ గ్యాస్‌ ధర.. కిలోకు రూ.4 పెంచుతూ నిర్ణయం..!

Bank Holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..