AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ ఇటీవల కాస్త సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. కరోనా సమయంలో కాచుకోండి అంటూ నిత్యం ఎదో ఒక విషయం పై వార్తల్లో నిలిచిన కంగనా..

Kangana Ranaut : 'థాకడ్' మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా
Kanagan
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2022 | 11:33 AM

Share

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా (Kangana Ranaut )ఇటీవల కాస్త సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. కరోనా సమయంలో కాచుకోండి అంటూ నిత్యం ఎదో ఒక విషయం పై వార్తల్లో నిలిచిన కంగనా.. ఈ మధ్య పెద్దగా హడావిడి చేయడం లేదు అనేది బీటౌన్ టాక్. ఇక సినిమాల్లోనూ అమ్మడు జోరు తగ్గించిందని వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈసారి టార్గెట్ మిస్సయ్యే ప్రసక్తే లేదు అంటున్నారు ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్. సాహసాలు చేసిచేసి అలసిపోతున్నా.. అలసిపోతున్నట్టు కనిపించడం లేదామె. కానీ.. ఇదిగో ఇప్పుడే గురిపెట్టి కొట్టే మరొకటొచ్చింది. కాచుకోండి అంటున్నారు. ఆలియా, తాప్సీ లాంటి తన కౌంటర్‌పార్ట్స్ అందరూ అటోఇటో ఎటోవైపు దూసుకెళ్తుంటే ఫైర్‌బ్రాండ్ కంగనా కూడా ఎలర్ట్ అయ్యారు. లాకప్‌ అనే రియాలిటీ షోని హోస్ట్ చేస్తూ డిజిటల్ ఆడియన్స్‌తో టచ్‌లోకొచ్చారు. బిగ్‌ స్క్రీన్స్‌ని కూడా ఓ పట్టు పట్టాలన్న కసి కనిపిస్తోంది క్వీన్ దగ్గర.

ఈసారి థాకడ్ అనే బలీయమైన సబ్జెక్ట్‌తో బిగ్ ఎఫర్ట్ పెట్టారామె. అర్జున్‌ రాంపాల్‌తో కలిసి నటిస్తున్న కంగనా… ఇందులో ఏజెంట్ అగ్ని అనే స్పై ఏజెంట్‌గా కనిపిస్తారు. టెరిఫిక్ యాక్షన్‌ సీన్స్‌తో హీరోలకే రిటార్ట్ ఇవ్వాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్నారు. ట్రయిలర్ లాంచ్‌లో కంగనా చేసిన హల్‌చల్ చూసి.. బీటౌనే హడలిపోతోంది. సౌత్ సినిమాను రిపీటెడ్‌గా పొగుడుతూ నార్త్‌ ఇండస్ట్రీతో శత్రుత్వం పెంచుకున్న కంగనా… తలైవితో సౌత్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని కల గన్నారు. అది సాకారం కాలేదు. ఇటు.. హిందీలో కూడా పంగా పేరుతో చేసిన స్పోర్ట్స్‌ డ్రామా ఒక్కటే కంగనాకు మిగిలిన లేటెస్ట్ మెమరీ. అందుకే.. థాకడ్ మూవీతో నేనేంటో చూపిస్తానంటూ గర్జిస్తున్నారు కంగనా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్