AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Meena: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏంచేయాలో చెప్పిన సీనియర్ నటి..

మహావేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.

Actress Meena: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏంచేయాలో చెప్పిన సీనియర్ నటి..
meena-.
Rajeev Rayala
|

Updated on: May 13, 2021 | 10:25 PM

Share

Actress Meena: మహావేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నయాలు చేస్తున్నాయి.. ప్రభుత్వానికి తోడు సెలెబ్రెటీలు కూడా ప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. ప్రివెన్షన్‌ ఈజ్‌ క్యూర్‌ బెటర్‌ దెన్‌ ట్రీట్‌మెంట్‌ అన్న నానుడి ఉండనే ఉంది.

ఇదే విషయాన్ని నటి మీనా ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో కరోనా బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వీడియోలో మాస్క్ ఎలా ధరించాలో ఆమె చూపించారు.

బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన మీనా తర్వాత హీరోయిన్‌ అయ్యారు. అగ్రశ్రేణి హీరోలందరి సరసనా నటించారు. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మీనా ఆ మధ్యన దృశ్యం సినిమాతో మళ్లీ పాపులరయ్యారు.. ఇన్నాళ్లకు దృశ్యం 2లో నటించి మంచి హిట్టు కొట్టారు. ప్రస్తుతం తెలుగు, మలయాళ సినిమాల్లో మీనా బిజీ ఆర్టిస్టయ్యారు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు మీనా. చిరంజీవి, వెంకటేష్లతో చాల సినిమాల్లో నటించారు మీనా. ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో మీనా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో బాలయ్య తో కలిసి నటించనున్నారని తెలుస్తుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood : సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో

Actor Kamal Haasan: కమల్ హాసన్ వల్లే సినిమా ఆలస్యం అవుతుంది.. సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు

Radhe Movie: స‌ల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహ‌ర‌ణ‌.. ‘రాధే’ కోసం ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌.. స‌ర్వ‌ర్ క్రాష్‌..