Sonu Sood: తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్‌ !

లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఇండస్ట్రీ షట్‌డౌన్‌ అయి స్టార్స్ అంతా ఖాళీగా ఉంటే... సోనూసూద్ మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. ఫస్ట్ వేవ్‌ టైమ్‌లో వేల మంది వలస///

Sonu Sood: తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు  భయపడుతున్న మేకర్స్‌ !
Sonusood
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 10:20 PM

లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఇండస్ట్రీ షట్‌డౌన్‌ అయి స్టార్స్ అంతా ఖాళీగా ఉంటే… సోనూసూద్ మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. ఫస్ట్ వేవ్‌ టైమ్‌లో వేల మంది వలస కార్మికులకు సాయం చేసిన సోనూ… రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లోనూ సేవ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు సోనూ. దీంతో ఆయనే పీఎం కావాలన్న డిమాండ్ కూడా మొదలైంది. అయితే సోనూ మాత్రం తనకు సామాన్యుడిగా సాయం చేయటమే ఇష్టమంటున్నారు. పదవుల మీద ఆశలేదు.. సాయం చేయటం నాకు ఇష్టం అంటూ సైలెంట్‌గా సైడయ్యారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌, మెడిసిన్ అందక కష్టాలు పడుతున్న వారికి తనవంతు సాయం అందిస్తున్నారు ఈ రియల్‌ హీరో. సామాన్యులే కాదు… సెలబ్రిటీలు కూడా సోనూ వల్ల సాయం పొందుతున్నారు. అందుకే ఏకంగా సోనూసూద్‌ను దేవుడితో పోలుస్తున్నారు అభిమానులు.

ఈ సేవాకార్యక్రమాలతో సోనూ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది. దీంతో ఇన్నాళ్లు నెగెటివ్ రోల్స్‌ చేసిన ఈ టాలెంటెడ్ స్టార్‌ని ఇప్పుడు విలన్‌గా చూపించేందుకు కూడా భయపడుతున్నారు మేకర్స్‌. జనాల్లో రియల్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నటుడు తెర మీద విలన్‌లా కనిపిస్తే యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారట మేకర్స్‌.

Also Read: మరో సినిమాతో రాబోతున్న వర్మ.. ఈసారి ప్రేక్షకులకు టాబ్లెట్ వేయనున్నాడు…

డిజిటల్ రిలీజ్ కు ‘చెక్’ రెడీ.. ఓటీటీలో అయినా హిట్ కొట్టేనా.. !