Check movie in OTT: డిజిటల్ రిలీజ్ కు ‘చెక్’ రెడీ.. ఓటీటీలో అయినా హిట్ కొట్టేనా.. !

కరోనా టైమ్‌లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు షార్ట్ గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేశాయి. వకీల్ సాబ్‌ లాంటి బిగ్ హిట్ సినిమా కూడా మూడు వారాల్లోనే డిజిటల్‌ ఆడియన్స్‌ను పలకరించింది.

Check movie in OTT:  డిజిటల్ రిలీజ్ కు 'చెక్' రెడీ.. ఓటీటీలో అయినా హిట్ కొట్టేనా.. !
Check Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 10:11 PM

కరోనా టైమ్‌లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు షార్ట్ గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేశాయి. వకీల్ సాబ్‌ లాంటి బిగ్ హిట్ సినిమా కూడా మూడు వారాల్లోనే డిజిటల్‌ ఆడియన్స్‌ను పలకరించింది. దీంతో కాస్త అటు ఇటుగా ఆగిపోయినా సినిమాలన్నీ ఓటీటీలో వచ్చేస్తాయని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌.అనుకున్నట్టుగానే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న చెక్‌… డిజిటల్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. మే 14న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది చెక్‌. థియేట్రికల్ రన్‌లో ఫెయిల్ అయిన చాలా సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అయ్యాయి. చెక్‌ విషయంలోనూ మేకర్స్ ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. చెక్ విషయంలోనూ క్లారిటీ రావటంతో ఇప్పుడు అభిమానులు అరణ్య వైపు చూస్తున్నారు. రానా లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమా నార్త్ రిలీజ్‌ వాయిదా పడినా.. సౌత్‌లో మాత్రం విడుదలైంది.

కానీ థియేట్రికల్ రిలీజ్‌లో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయినా మేకర్స్ మాత్రం డిజిటల్ రిలీజ్ విషయంలో ఎలాంటి ఆలోచనా చేయటంలేదు. చెక్‌ రిలీజ్‌ తరువాతైనా అరణ్య ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వస్తుందోమో చూడాలి.

Also Read: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్

బాలయ్య అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ హీరోతోనేనా..?