Boyapati Srinu: బాలయ్య అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ హీరోతోనేనా..?

అఖండ కోసం రొమాంటిక్ సాంగ్ మేకింగ్ లో బిజీగా వున్నారు బీబీ3 డైరెక్టర్. బాలయ్య ఫ్యాన్స్ కి మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలన్న కమిట్మెంట్ తో పాటు...

Boyapati Srinu: బాలయ్య అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ హీరోతోనేనా..?
Rajeev Rayala

|

May 13, 2021 | 8:26 PM

Boyapati Srinu: అఖండ కోసం రొమాంటిక్ సాంగ్ మేకింగ్ లో బిజీగా వున్నారు బీబీ3 డైరెక్టర్. బాలయ్య ఫ్యాన్స్ కి మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలన్న కమిట్మెంట్ తో పాటు.. తన కెరీర్ ని చక్కదిద్దుకోవాలన్న క్లారిటీతో కూడా వున్నారు కెప్టెన్ బోయపాటి. అందరికీలాగే తనకు మూడునాలుగు సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ లేదు. కానీ.. నెక్స్ట్ చెయ్యబోయే ఒక్క సినిమా.. నాలుగు సినిమాలంత సౌండ్ ఇవ్వాలన్నది బోయపాటి తపన. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న భద్ర రిలీజై మే12కు  16 ఏళ్ళు. బలమైన సెంటిమెంట్ ని, పవర్ ఫుల్ ఏక్షన్ తో జతకలిపి సక్సెస్ కొట్టడం అనేది అప్పటినుంచే ఒక ట్రెండ్ గా మారింది. దిల్ రాజు ఇంట్రడ్యూస్ చేసిన బోయపాటి శ్రీనుకి డెబ్యూ మూవీగా భద్ర రేంజ్ అది. ఆ తర్వాత బోయపాటి మజిలీ ఎన్ని మలుపులు తిరిగినా.. ఇప్పుడు తాను తీసుకోబోయే టర్న్ చాలా క్రూషియల్.

సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండను చాలా ప్రెస్టీజియస్ గా భావిస్తున్నారు బోయపాటి. ఇందులో కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. టీజర్ తోనే హిట్ గ్యారంటీ అనే భరోసా కల్పించారు. కట్ చేస్తే… వాట్ నెక్స్ట్ అనేది బోయపాటి క్యాంపుని వేధిస్తున్న ప్రశ్న. బన్నీకి సరైనోడు అనే ట్యాగ్ ఇచ్చి.. మాస్ కా బాప్ అనిపించుకున్న బోయపాటి.. మరోసారి బన్నీకే ఓటేస్తారా? అల్లు అర్జున్ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసిపెట్టారని.. ఇది సరైనోడు కంటే సాలిడ్ అనిపించడంతో బన్నీ కూడా ఓకే చెప్పారని వార్తలొస్తున్నాయి. కానీ.. ఇప్పటికే బన్నీ కిట్టీ చాలా బరువుగా వుంది. పుష్ప రెండు పార్టులతో పాటు మురుగదాస్ తో ఒకటి, ప్రశాంత్ నీల్ తో మరోటి చెయ్యబోతున్నారు. ఈలోగా ఐకాన్ ప్రాజెక్టు ఉండనే వుంది. అందుకే మరో మూడేళ్లు గ్యాప్ తీసుకునే పన్లేకుండా.. చరణ్ వైపు చూస్తున్నారట బోయపాటి. కమర్షియల్ గా ఫెయిల్ కావడమే గాక, కెరీర్ పరంగా తన ప్రతిష్టను దెబ్బతీసిన వినయవిధేయరామను ఇప్పట్లో మర్చిపోలేరు బోయపాటి. దాన్ని మరిపించే బొమ్మనిస్తానని చరణ్ కి అప్పట్లోనే మాటిచ్చారట. అందుకే.. ఈ గ్యాప్ లో మెగాపవర్ స్టార్ కోసం జబర్దస్త్ లైన్ ప్రిపేర్ చేస్తున్నారు. శంకర్-చెర్రీ పాన్ ఇండియా మూవీ ఆర్నెల్లలో ఫినిష్ చెయ్యాలన్న కమిట్మెంట్ వుంది. ఆ వెంటనే చరణ్ ని టేకప్ చేసి హిస్టరీ తిరగరాయాలన్నది ఈ డైనమిక్ డైరెక్టర్ స్ట్రాటజీ. చూడాలి ఏమవుతుందో!

మరిన్ని ఇక్కడ చదవండి : 

South Indian actress: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్

Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్… మీకు తోచినంత సాయం చేయండంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu