Sonu Sood : సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో

సోనూసూద్ ఈ పేరును దేశం అంత సులువుగా మారిపోదు. కరోనా సమయంలో ప్రేజలకు అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్.

Sonu Sood : సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: May 13, 2021 | 9:00 PM

 Sonu Sood : సోనూసూద్ ఈ పేరును దేశం అంత సులువుగా మారిపోదు. కరోనా సమయంలో ప్రేజలకు అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి వారి పాలిట దైవంగా మారాడు. ఓవైపు కరోనా పై యుద్ధం చేస్తూ.. నిత్యం సామాన్యులకు సేవలను అందిస్తూ వైద్యసిబ్బందికి కూడా తానే సాయం చేస్తున్నాడు సోనూసూద్. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్ ను కొనియాడుతూనే ఉంది.సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే ఆక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూ ఫౌండేషన్ ద్వారా  కష్టం అన్నవారికి సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. అయితే  ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వరికుంటపాడుకి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్ కి 15వేలు విరాళంగా అందచేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన దృష్టిలో నాగలక్ష్మి రిచెస్ట్ ఇండియన్ గా అభివర్ణించారు. అంతే కాదు ఒకరి బాధను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు. తను విరాళం ఇచ్చిన 15 వేలు నాగలక్ష్మి ఐదు నెలల పెన్షన్ కావటం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..

Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్… మీకు తోచినంత సాయం చేయండంటూ..