ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..

పాలస్తీనాలో హింస కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ఇస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా..

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..
Kangana
Follow us
Sanjay Kasula

|

Updated on: May 13, 2021 | 7:24 PM

ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. పాలస్తీనాలో హింస కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ఇస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాలస్తీనాకు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే, పాలస్తీన్‌కు ఇర్ఫాన్ మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌  మండిపడ్డారు. కంగనా చేసిన రీ ట్వీట్‌కు  సమాధానం ఇచ్చాడు ఇర్ఫాన్.

పాలస్తీనాపై జరిగిన యుద్ధంలో చాలా మంది చిన్న పిల్లలు, సామాన్య ప్రజలు చనిపోతున్నట్లు నివేదికలు ఉన్నాయంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ముందుగా మంగళవారం ఇజ్రాయెల్ హమాస్ రాజకీయ వింక్ అధికారిపై దాడి చేసి, 13 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం 20 మే 921 ఆదివారం ప్రారంభమైంది. రెండు వైపుల నుండి రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. 1966 సంవత్సరం తరువాత మొదటిసారి లాడ్ నగరంలో పూర్తి అత్యవసర పరిస్థితి విధించడం.

ఇర్ఫాన్ ట్వీట్‌తో కంగనాకు కోపం వచ్చింది

ఇర్ఫాన్ మంగళవారం ట్వీట్ చేయడం ద్వారా పాలస్తీనాకు మద్దతు ఇచ్చాడు. ‘మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి’ అంటూ మరోసారి ట్వీట్ చేశారు.

కంగనా రనౌత్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా పై ఒక పోస్ట్‌  చేసి ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసింది. ‘ఇర్ఫాన్ పఠాన్‌కు ఇతర దేశాలపై అంత ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశంలో బెంగాల్‌పై ట్వీట్ పెట్టలేకపోయాడు’ అని కంగనా  తన పోస్ట్‌లో రాశారు. కంగనా యొక్క ఈ సమాధానం ఇర్ఫాన్ పఠాన్‌కు నచ్చలేదు. ఇలాంటి  ప్రకటనల వల్ల తన ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయిందని ఆయనకు కంగనా గుర్తు చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ బదులిచ్చారు- ‘నా ట్వీట్లన్నీ మానవత్వం లేదా దేశస్థుల కోసమే. ఇందులో దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి యొక్క అభిప్రాయం ఉంది. మరోవైపు కంగనా నుంచి నేను వినవలసి ఉంది. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వలన ఆమె  ఖాతా నిలిపివేయబడింది అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!