AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక సమావేశాలను ఏర్పాటు చేశారు.

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!
PM Modi
Balaraju Goud
|

Updated on: May 13, 2021 | 5:03 PM

Share

PM Modi’s to hold discussions: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈనెల 18వ తేదీన , 20వ తేదీన ఈ భేటీలు ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతారు. రెండు విడతలుగా ఈ సమావేశాలు ఉంటాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాలో పాల్గొంటారు.

ఈనెల18వ తేదీన జరిగే సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లతో మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రెండు రోజులు తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు తిరిగి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. బీహార్‌లో మే 25 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. మహారాష్ట్రలో జూన్‌ 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవైపు యుపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జూన్‌ 27 న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10వ తేదీకి వాయిదా వేశారు.

ఇదిలావుంటే, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి రోజువారీ కేసులు. నిత్యం 4వేల మందికి పైగా మృతి చెందుతున్నారు. పెరుగుతున్న పాజిటివిటీ, మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో టీకా‌ పంపిణీ చేయాలని ప్రధాని మోదీకి లేఖరాశారు విపక్ష పార్టీల నేతలు. దేశ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు 6 వేలు ఇవ్వాలని..సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇక ఆక్సిజన్, ఔషధాల లభ్యత, సరఫరాపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఔషధాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని..తయారీదారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. గత కొన్నివారాల్లో రెమ్‌డెసివిర్ సహా ఔషధాల ఉత్పత్తి భారీగా పెరిగిందని ప్రకటించారు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా మూడురేట్లు పెరిగిందని..వెంటిలేటర్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను కోరారు.

అయితే, భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌కు తప్పుడు అంచనాలే కారణమంటున్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ. కరోనా తగ్గిందని అన్ని కార్యక్రమాలకు అనుమతించారని.. విచ్చలవిడి కార్యక్రమాలే కరోనా ఉధృతికి కారణమంటున్నారు.

Read Also…  కొవిడ్‌తో పోరాడటానికి.. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి.. వెల్లుల్లి, చింతపండుతో చేసిన ఈ సూప్ ట్రై చేయండి..