Fake Sim Card: మీ పేరు మీద ఎవరైనా నకిలీ సిమ్ కార్డు వాడుతున్నారా? ఇలా తెలుసుకోండి.. చిటికెలో బ్లాక్ చేయండి..
Fake Sim Card: ప్రస్తుత కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన పేర్ల మీద ధ్రువపత్రాలు, సిమ్ కార్డులు ఇతరాలు..
Fake Sim Card: ప్రస్తుత కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన పేర్ల మీద ధ్రువపత్రాలు, సిమ్ కార్డులు ఇతరాలు తీసుకుంటున్నారు. తీరా మనకు తెలిసే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే సిమ్ కార్డు వినియోగదారుల రక్షణ కోసం టెలికాం విభాగం తాజాగా ప్రత్యేక పోర్టల్‌ను విడుదల చేసింది. ఈ పోర్టల్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు జారీ చేయబడ్డాయో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ నెంబర్‌ను మీ అనుమతి లేకుండా దేనికోసమైనా వినియోగించారా? అనేది కూడా తెలుసుకోవచ్చు. ఒక వేళ మీ పేరు మీద ఇతరులెవరైనా సిమ్ కార్డు తీసుకున్నట్లయితే.. వెంటనే దాన్ని బ్లాక్ చేసే అవకాశం కల్పించారు.
మీ మొబైల్ నెంబర్ ని ఇలా తనిఖీ చేసుకోండి.. 1. మీ నంబర్ దుర్వినియోగం గురించి తెలుసుకోవడానికి, ముందుగా మీరు ప్రభుత్వ పోర్టల్ (https://tafcop.dgtelecom.gov.in/alert.php) లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 2. ఆ తరువాత మీరు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటిపి వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాలి. 3. ఇప్పుడు టెలికాం విభాగం నుండి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారునికి సమాచారం పంపించడం జరుగుతుంది. సంబంధిత వినియోగదారుడి పేరు మీద ఎన్ని యాక్టీవ్ మొబైల్ నెంబర్లు ఉన్నాయనే దానిపై పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది. 4. ఆ తరువాత, వినియోగదారుడు తమకు తెలియని నెంబర్ తమ పేరుపై ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని తొలగించమని/బ్లాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టవచ్చు. 5. అలా రిక్వెస్ట్ పెట్టిన తరువాత.. టెలికాం డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ ఐడీని కంప్లైంట్ ఇచ్చిన వినియోగదారుడికి పంపుతుంది. ఆ ఐడీ ద్వారా మీ రిక్వెస్ట్‌ని ట్రాక్ చేయవచ్చు.
Also read:
Viral News: ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి.. కానీ