కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కరోనా వైరస్ పై పోరులో గెలుద్దామన్న కుమార్తె సౌందర్య
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పీపీఈ కిట్ ధరించిన హెల్త్ కేర్ వర్కర్ ఒకరు ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పీపీఈ కిట్ ధరించిన హెల్త్ కేర్ వర్కర్ ఒకరు ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సౌందర్య ట్వీట్ చేస్తూ’మా తలైవార్’ వ్యాక్సిన్ తీసుకున్నారని, కరోనా వైరస్ పై అందరం కలిసి పోరాటం జరిపి విజయం సాధిద్దామని అన్నారు. కాగా రజనీకాంత్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, ఇది ఆయనకు తొలి డోసా లేక రెండవదా అన్న విషయం తెలియలేదు. అన్నాథే మూవీ షూటింగ్ ముగించుకుని రజనీ..నిన్న హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఇక మరో సీనియర్ నటుడు కమల్ హసన్ కూడా ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్నారు. గత మార్చిలో మొదటి డోసు టీకామందు తీసుకున్న ఆయన.. ప్రతివారూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో కమల్ హసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఓడిపోయింది. ఓటమి చవి చూసిన మరుసటి రోజే ఈ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమల్ హసన్ ఆయనను ద్రోహిగా అభివర్ణించారు. ఇలాంటి కలుపు మొక్కలు పార్టీలో వుండకపోవడమే మంచిదని అన్నారు. అటు-ఒక దశలో రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ఏర్పాటు చేద్దామనుకున్నప్పటికే అస్వస్థత కారణంగా ఆ యోచనను విరమించుకున్నారు. పలువురు అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలు మనకు వద్దని హితవు చెప్పడంతో ఆయన ఇక దానిపై ఆలోచించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి.. కానీ
Viral News: ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి.. కానీ