వావ్ ! ఉన్నది ఒకటే ఊపిరితిత్తి, కానీ యోగా, ప్రాణాయామంతో కోవిడ్ ను జయించిన నర్సు, అభినందించిన డాక్టర్లు

మధ్యప్రదేశ్ లో ఓ నర్స్ కోవిడ్ తో పోరాటం చేసి విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఆమెకు ఒకటే ఊపిరితిత్తి ఉంది. కానీ కోవిడ్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంది.

  • Updated On - 8:45 pm, Thu, 13 May 21 Edited By: Phani CH
వావ్ ! ఉన్నది ఒకటే ఊపిరితిత్తి, కానీ యోగా, ప్రాణాయామంతో కోవిడ్ ను జయించిన నర్సు,  అభినందించిన డాక్టర్లు
Nurse Battles Covid With On


మధ్యప్రదేశ్ లో ఓ నర్స్ కోవిడ్ తో పోరాటం చేసి విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఆమెకు ఒకటే ఊపిరితిత్తి ఉంది. కానీ కోవిడ్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంది. 14 రోజుల్లోనే కోలుకుంది. 39 ఏళ్ళ ప్రఫులిత్ పీటర్ అనే ఈమె చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్ కారణంగా ఓ ఊపిరితిత్తిని కోల్పోయింది. అప్పట్లోనే ఆపరేషన్ చేసి డాక్టర్లు ఈమెకు ఓ లంగ్ తొలగించారట. 2014 లో చెస్ట్ ఎక్స్-రే కి వెళ్ళినప్పుడు ఈమెకు ఈ విషయం తెలిసిందట. అయితే ఇంతముఖ్యమైన మెడికల్ అంశాన్ని ఈమె తలిదండ్రులు డాక్టర్లకు తెలియజేయలేదా అన్న విషయం మిస్టరీగా ఉంది. కాగా తికంగఢ్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డులో రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ప్రఫులిత్ పీటర్ కోవిద్ బారిన పడింది. ఒకే ఊపిరితిత్తి ఉన్నందుకు ఈమె పేరెంట్స్, బంధువులు, డాక్టర్లు కూడా ఈమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పీటర్ మాత్రం అధైర్య పడలేదు. 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూనే రోజూ యోగా, ప్రాణాయామం చేయడమే కాకుండా తన ఒకే ఊపిరితిత్తి పటిష్టత కోసం బెలూన్లు కూడా ఊదుతూ వచ్చిందట

చివరకు ప్రఫులిత్ పీటర్ కోవిద్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. తలిదండ్రులు,బంధువులతో బాటు వారు కూడా ఆమెను అభినందించారు. నీ అకుంఠిత ధైర్యమే ఈ మహమ్మారి నుంచి నిన్ను కాపాడింది అని వారు వెన్ను తట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ నర్సు తన విధుల్లో చేరింది.కోవిద్ వార్డులోనే రోగులకు సేవలు అందిస్తోంది. .

మరిన్ని ఇక్కడ చూడండి: జాక్‌ప్రూట్ గురించి మీకు తెలుసా..? శాకాహారులకు ఇది మాంసాహారం..! కరోనా టైంలో తప్పక తీసుకోవాలి.

Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..

.