Coronavirus: మానవత్వానికి మచ్చ… ఆక్సిజన్ ఇవ్వాలంటే కోరిక తీర్చమన్న కామాంధుడు
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. వర్ణించే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. దేశమంతటా ఎక్కడ చూసినా....
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. వర్ణించే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. దేశమంతటా ఎక్కడ చూసినా ఆక్సిజన్ , బెడ్ల కొరత విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర నిరాశ, భయంలో కూరుకుపోయి ఉన్నారు. కరోనా బారినపడిన తమవాళ్ల ప్రాణాలను నిలుపుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సంక్షోభ పరిస్థితులు సమాజంలో దాగిఉన్న కొందరి వ్యక్తుల క్రూర ఆలోచనలను కళ్లకు కట్టేలా చేస్తున్నాయి. తాజాగా తనకు కావాల్సిన వ్యక్తి ఎదుర్కున్న తీవ్రమైన ఇబ్బందిని ఓ ట్విట్టర్ యూజర్ ప్రజలతో పంచుకున్నారు.
My friend’s sister like my baby sister was asked by a neighbour in an elite colony to sleep with him for an oxygen cylinder that she desperately needed for her father;
What action can be taken because the b* will obviously deny, no?#HumanityIsDead
— Bhavreen Kandhari (@BhavreenMK) May 11, 2021
‘నాకు సోదరిలాంటి యువతి తండ్రి కరోనాతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆమె పొరిగింటివారిని ఆక్సిజన్ సిలిండర్ కావాలని కోరింది. దానికి ప్రతిగా అతడు.. తనతో సెక్స్ చేయాలని కోరాడు. ఇటువంటి వెదవలపై ఎలాంటి చర్య తీసుకోవాలి. మానవత్వం చచ్చిపోయింది’ అని ఆమె ట్వీట్ చేశారు.
వేలాదిమందిని ఈ పోస్ట్ కదిలించింది. తీవ్ర ఆగ్రహావేశాలు రేపింది. నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి వార్త గురించి ప్రస్తావించాల్సి రావడం ధౌర్భాగ్యకరమైన విషయం.