విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వీరికి నెలకు రూ. 25,000 ఫెలోషిప్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థులంతా

విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Students
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2021 | 4:39 PM

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వీరికి నెలకు రూ. 25,000 ఫెలోషిప్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థులంతా తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ కోసం అప్లై చేయడానికి మే 18 చివరితేదీగా నిర్ణయించింది. అసలు విషయం ఎంటంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) సంస్థ జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 ప్రకటించింది. ఈ సమ్మర్ ఫెలోషిప్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 కోసం దరఖాస్తు చేయడానికి మే 18 చివరితేదిగా నిర్ణయించింది.

అయితే దీనికి కేవలం 15 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఎస్‌బీ, ఐఐటీ, ఎస్‍పీఏ, ఎన్ఐటీ, బిట్స్ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారు.. ప్రస్తుతం చదువుతున్నవారు దీనికి అర్హులు. అంతేకాకుండా.. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులూ కూడా ఈ ఫెలోషిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఏ సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ప్యానెల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇది మూడు నెలలు ఉంటుంది. అలాగే దీనికి ఎంపికైన వారికి మూడు రోజుల పాటు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ఫెలోస్ కు పలు డిపార్డ్ మెంట్స్ కేటాయిస్తారు. ఫెలోషిప్ కాలంలో 30 రోజుల తర్వాత మిడ్ టర్మ్ ఎవాల్యుయేషన్, 75 రోజుల తర్వాత ఎండ్ టర్మ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. మూడు నెలల ఫెలోషిప్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ ఫెలోషిప్ కోసం ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను jaganannafellowship@apssdc.in సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన విద్యార్థలకు నెలకు రూ.25,000 ఫెలోషిప్ ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను https://www.apssdc.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇక మే 20న ఈ ఫెలోషిప్ ప్రక్రియకు షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థుల జాబితాను ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇక ఆ తర్వాత మే 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మే 26న విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి జూన్ 1 నుంచి ఫెలోషిప్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది కేవలం సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ మాత్రమే. అంటే కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఇందులో విద్యార్థులు ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా వర్క్ ఫ్రమ్ హోం ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీ ప్రభుత్వానికి చెందిన నవరత్నాలు, వ్యవసాయ ఉత్పత్తుల సప్లయ్‌ చైన్, వ్యాల్యూ అడిషన్, ఆత్మనిర్భర్ భారత్, పీఎల్ఐ స్కీమ్, సేవా రంగం, వృద్ధుల సంరక్షణ, ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఆదాయ వనరులు సమకూర్చుకోవడం వంటి అంశాలపై విద్యార్థులు పని చేయాల్సి ఉంటుంది.

Also Read: మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.