మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

Jan Dhan Yojana: మీకు జన్ ధన్ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్ ఉందా ? ఆ ఖాతాకు బ్యాంక్ అకౌంట్ జత చేసుకున్నారా ? ఒకవేళ మీరు మీ ఖాతాకు

మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..
Jandhan Yojana
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2021 | 3:32 PM

Jan Dhan Yojana: మీకు జన్ ధన్ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్ ఉందా ? ఆ ఖాతాకు బ్యాంక్ అకౌంట్ జత చేసుకున్నారా ? ఒకవేళ మీరు మీ ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంటీ ? ఏం ఇబ్బంది ? అనుకుంటున్నారా ? అయితే అదేంటో తెలుసుకుందాం.

జన్ ధన్ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకున్నట్లైతే మీకు రూ. 2 లక్షల వరకు పొందొచ్చు. లేదంటే మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. మీరు ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్ పొందలేరు. అంతేకాకుండా వీరికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా వీరికి రూ. 30 వేల వరకు భీమా లభిస్తుంది. అకౌంట్ కలిగిన వారు ఆకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి. ఆధార్ కార్డు లింక్ చేసుకోని వాళ్ళు ఈ ప్రయోజనాలను పొందలేరు. అలాగే ఈ రూపే కార్డు ద్వారా వినియోగదారులను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. అందువల్ల మీరు జన్ ధన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేసుకోకపోవడం వల్ల రూ.2.3 లక్షల వరకు నష్టపోవాల్సి రావొచ్చు. అందువల్ల మీరు వెంటనే బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..

ఇప్పటివరకు మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే.. మీ సమీప బ్యాంకుకు వెళ్లి.. జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి పూరించాలి.

ముఖ్య విషయాలు.. 1. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 2. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కెవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. 3. ఒక వేల మీకు ఆ పత్రాలు లేకపోతే మిని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 4. ఇందులో మీరు ఫోటో, మీ సంతకాన్ని బ్యాంక్ అధికారి ముందే నింపాలి. 5. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ డ్రింక్స్ సరైనవే.. రోజూ ఉదయం తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్లే..

క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!