Hyderabad Police: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్.. ప్రజలను అలర్ట్ చేస్తోన్న హైదరాబాద్ పోలీసులు
Hyderabad Police: కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యాధి యావత్ మానవ జాతిని గడగడలాడిస్తోంది. వ్యాధి కంటే భయం చాలా ప్రమాదకరమే మాట...
Hyderabad Police: కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యాధి యావత్ మానవ జాతిని గడగడలాడిస్తోంది. వ్యాధి కంటే భయం చాలా ప్రమాదకరమనే మాట కరోనా విషయంలో అక్షర సత్యంగా నిలుస్తోంది. నిజానికి కరోనా అంత ప్రమాదకరమైన వ్యాధికాకపోయినప్పటికీ చాలా మంది భయంతోనే మరణిస్తున్నారు. ఎక్కడో ఏదో జరిగిపోతోందన్న గందరగోళం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరు ఏది చెప్పినా వెంటనే ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అశాస్త్రీయ చిట్కాలను ఉపయోగించి కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మనుషుల భయాన్ని వాడుకుని వ్యాపారం చేసే వారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ వేదికగా కరోనా చికిత్స కోసం అంటూ కొన్ని మందులు బాగా హల్చల్ చేస్తున్నాయి. భయంతో ఉన్న ప్రజలు ముందూ వెనకా చూడకుండా ఆన్‌లైన్‌లో మందులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలను అలర్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అనధికారిక వెబ్‌సైట్లు, వ్యక్తుల నుంచి కోవిడ్ చికిత్స పేరుతో అమ్ముతోన్నమందులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి. ఇవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..
#Beware pic.twitter.com/ForxSIQoEu
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 13, 2021
Coronavirus: మానవత్వానికి మచ్చ.. ఆక్సిజన్ ఇవ్వాలంటే సెక్స్ డిమాండ్ చేసిన కామాంధుడు
జాక్‌ప్రూట్ గురించి మీకు తెలుసా..? శాకాహారులకు ఇది మాంసాహారం..! కరోనా టైంలో తప్పక తీసుకోవాలి..