అరబ్ అనుకుని కారు లోనుంచి లాగి, మూకుమ్మడిగా యూదుల దాడి, ఇజ్రాయెల్ లో దారుణం, తీవ్రంగా గాయపడిన వ్యక్తి
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. గాజా సిటీపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతుండగా గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు వందలకొద్దీ రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. గాజా సిటీపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతుండగా గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు వందలకొద్దీ రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తున్నారు. పగలు, కక్షలు, కార్పణ్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టెల్ అవివ్ దగ్గరి సిటీలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా అతడిని అరబ్ గా భావించిన కొందరు కారును వెంబడించి ఆపి వేశారు. ఆ వ్యక్తిని వాహనం లోనుంచి లాగి కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. ఆ గుంపు దాడికి మరికొందరు కూడా తోడై అతడిని దుర్భాషలాడుతూ కసి దీరా కాళ్లతో తన్నారు. ఈ ఎటాక్ తాలూకు దృశ్యమంతా సీసీటీవీలో రికార్డు కాగా ఇజ్రాయెల్ టీవీ దీన్ని లైవ్ గా ప్రసారం చేజేసింది. అసలు ఆ వ్యక్తి అరబ్బా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే అంతా దాడికి దిగారు. రోడ్డుపై స్పృహ కోల్పోయి అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తి మరణించాడనుకుని అంతా అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎటాక్ జరిగిన కొద్దిసేపటి తరువాత వచ్చిన పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు తగిలాయని, అయితే ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కాగా చాలామంది తమ దాడిని సమర్థించుకున్నారు. ఇతడు అరబ్ అనడంలో అనుమానం లేదని, తన కారును తమపైకి వేగంగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడని వారు అంటున్నారు. ఇలాంటివారిని తాము వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. ఒక మోటారిస్టు ఈ ఎటాక్ నుంచి ఆ వ్యక్తిని రక్షించబోగా అతడిపైకి కూడా గుంపు దాడికి యత్నించింది. అయితే యూదులు ఇలా హింసకు తెగబడరాదని ఇజ్రాయెల్ చీఫ్ ఒకరు పిలుపునిచ్చారు.
לינץ’ בשידור חי בבת ים: צעירים יהודים תקפו באלימות קשה רוכב אופנוע, השוטרים לא היו בזירה | תיעוד@daniel_elazar #חדשותהערב pic.twitter.com/hBN0e8UrCW
— כאן חדשות (@kann_news) May 12, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Coronavirus: మానవత్వానికి మచ్చ.. ఆక్సిజన్ ఇవ్వాలంటే సెక్స్ డిమాండ్ చేసిన కామాంధుడు
AIIMS Gorakhpur Recruitment: గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలయంటే..