Coronavirus: మానవత్వానికి మచ్చ… ఆక్సిజన్ ఇవ్వాలంటే కోరిక తీర్చ‌మ‌న్న కామాంధుడు

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. వ‌ర్ణించే ప‌రిస్థితులు కూడా లేకుండా పోయాయి. దేశ‌మంత‌టా ఎక్క‌డ చూసినా....

Coronavirus: మానవత్వానికి మచ్చ... ఆక్సిజన్ ఇవ్వాలంటే కోరిక తీర్చ‌మ‌న్న కామాంధుడు
Oxygen Cyliender
Follow us
Ram Naramaneni

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 12:46 PM

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. వ‌ర్ణించే ప‌రిస్థితులు కూడా లేకుండా పోయాయి. దేశ‌మంత‌టా ఎక్క‌డ చూసినా ఆక్సిజ‌న్ , బెడ్ల కొర‌త విప‌రీతంగా ఉంది. దీంతో ప్ర‌జలు తీవ్ర నిరాశ‌, భ‌యంలో కూరుకుపోయి ఉన్నారు. క‌రోనా బారిన‌ప‌డిన త‌మ‌వాళ్ల ప్రాణాల‌ను నిలుపుకోడానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఈ సంక్షోభ ప‌రిస్థితులు స‌మాజంలో దాగిఉన్న కొందరి వ్య‌క్తుల క్రూర ఆలోచ‌న‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చేస్తున్నాయి. తాజాగా త‌న‌కు కావాల్సిన వ్య‌క్తి ఎదుర్కున్న తీవ్ర‌మైన ఇబ్బందిని ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.

‘నాకు సోద‌రిలాంటి యువ‌తి తండ్రి క‌రోనాతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆమె పొరిగింటివారిని ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ కావాల‌ని కోరింది. దానికి ప్ర‌తిగా అత‌డు.. త‌నతో సెక్స్ చేయాల‌ని కోరాడు. ఇటువంటి వెద‌వ‌ల‌పై ఎలాంటి చర్య తీసుకోవాలి. మాన‌వత్వం చ‌చ్చిపోయింది’ అని ఆమె ట్వీట్ చేశారు.

వేలాదిమందిని ఈ పోస్ట్ క‌దిలించింది. తీవ్ర ఆగ్ర‌హావేశాలు రేపింది. నిజంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇటువంటి వార్త గురించి ప్ర‌స్తావించాల్సి రావ‌డం ధౌర్భాగ్య‌క‌ర‌మైన విష‌యం.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..