AIIMS Gorakhpur Recruitment: గోర‌ఖ్‌పూర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

AIIMS Gorakhpur Recruitment 2021: భార‌త‌ ప్ర‌భుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఫ్యాకల్టీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. గోర‌ఖ్‌పూర్‌లోని...

AIIMS Gorakhpur Recruitment: గోర‌ఖ్‌పూర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Iit Gorakhpur
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2021 | 5:43 PM

AIIMS Gorakhpur Recruitment 2021: భార‌త‌ ప్ర‌భుత్వ రంగ సంస్థ.. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఫ్యాకల్టీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. గోర‌ఖ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో మొత్తం 127 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు..

* ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా అనెస్తీసియాల‌జీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ వంటి పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన విభాగాల్లో భాగంగా ప్రొఫెస‌ర్‌-30, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్‌-22, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-46, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-29 ఖాళీల‌ను భ‌ర్తీ చేయనున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌)లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా ఉపాధ్యాయ‌/ప‌రిశోధ‌న‌లో అనుభ‌వం ఉండాలి.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూకు గోర‌ఖ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో హాజ‌రుకావాల్సి ఉంటుంది.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 08-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు https://aiimsgorakhpur.edu.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ. 25,000 ఫెలోషిప్.. మే 18 దరఖాస్తులకు చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

UPSC Prelims Exam 2021: క‌రోనా వేళ యూపీఎస్‌సీ కీల‌క నిర్ణ‌యం.. ప‌రీక్ష‌ల తేదీలో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న‌..

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. చివరి తేదీ జూన్‌ 4.. దరఖాస్తు చేయండిలా..!