ICF Jobs 2021: ఇండియన్ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Chennai ICF Recruitment 2021: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ పలు సంస్థలు వైద్య సంబంధిత ఉద్యోగులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా...
Chennai ICF Recruitment 2021: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ పలు సంస్థలు వైద్య సంబంధిత ఉద్యోగులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి చెందిన రైల్వే శాఖ కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చెన్నైలోని ఇండియన్ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 39 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు..
* మొత్తం 39 పోస్టుల్లో భాగంగా మెడికల్ ప్రాక్టీషనర్లు – 05, స్టాఫ్ నర్సు – 13, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ – 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 01.07.2021 నాటికి 53 ఏళ్లు మించకూడదు.
* స్టాఫ్ నర్సు పోస్టులకు అప్లై చేసుకునే వారు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం)/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు 01.07.2021 నాటికి 20–40 ఏళ్ల మధ్య ఉండాలి.
* హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. వయసు 01.07.2021 నాటికి 18–33 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకున్న వారిని మొబైల్/టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కు చివరి తేదీగా 13.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు http://pbicf.in./index.php వెబ్‌సైట్‌ను సందర్శించండి.