Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. చివరి తేదీ జూన్ 4.. దరఖాస్తు చేయండిలా..!
Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్-JAG బ్రాంచ్‌లో ఎంట్రీ స్కీమ్ 27వ కోర్స్..
Indian Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్-JAG బ్రాంచ్‌లో ఎంట్రీ స్కీమ్ 27వ కోర్స్ అక్టోబర్ 2021 కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ ఆర్మీ. లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అయితే పెళ్లికాని యువతీ యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ప్రీ-కమిషన్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఎంపికైనవారు 14 ఏళ్లు రెగ్యులర్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొదట 10 ఏళ్లు, ఆ తర్వాత 4 ఏళ్లు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుకోవడానికి జూన్ 4 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు కావాలంటే సంబంధిత వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. http://www.joinindianarmy.nic.in/.
ఖాళీల వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు- 8 యువకులు- 6 యువతులు- 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 4 విద్యార్హతలు- ఎల్ఎల్‌బీ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ తర్వాత మూడేళ్ల లా లేదా ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి. వయస్సు- 21 నుంచి 27 ఏళ్లు
దరఖాస్తు ఇలా చేయండి
► అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ► హోమ్ పేజీలో Officer Entry Apply/Login పైన క్లిక్ చేయాలి. ► ఆ తర్వాత Registration లింక్ పైన క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. ► రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి. ► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ► అందులో ఇతర వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ► దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఇవీ కూడా చదవండి:
Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా..? అయితే ఇలా తెలుసుకోండి..!