Southern Railway Recruitment: ఇండియ‌న్ రైల్వేలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. గురువార‌మే చివ‌రి తేది..

Southern Railway Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నై డివిజ‌న్‌లో మెడిక‌ల్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు...

Southern Railway Recruitment: ఇండియ‌న్ రైల్వేలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. గురువార‌మే చివ‌రి తేది..
Southern Railway Recruitment 2021
Follow us
Narender Vaitla

|

Updated on: May 11, 2021 | 9:40 PM

Southern Railway Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నై డివిజ‌న్‌లో మెడిక‌ల్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌నలో భాగంగా ప‌లు మెడిక‌ల్ పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో వైద్య సేవ‌ల‌ను మెరుగు ప‌రిచే క్ర‌మంలో వైద్య సిబ్బందిని పెంచే ఉద్దేశంతో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు..

మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్ (డాక్ట‌ర్లు)..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా 16 మంది మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్ (డాక్ట‌ర్లు) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఎబీబీఎస్ ఉత్తీర్ణ‌తో పాటు ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. * ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 75000 వేత‌నంగా అందిస్తారు.

న‌ర్సింగ్ స్టాఫ్‌.. * మొత్తం 16 న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు జీఎన్ఎం/బీఎస్సీ (న‌ర్సింగ్‌) విభాగంలో జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ మిడ్‌వైఫ‌రీలో ఉత్తీర్ణ‌త సాధించాలి. అంతేకాకుండా ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిప‌న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 01.05.2021 నాటికి 20-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు మొద‌ట ఆన్‌లైన్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేస్తారు. అనంత‌రం మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు 13.05.2021 (గురువారం) చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

Also Read: Telangana Medical Recruitment: క‌రోనా వేళ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భారీ సంఖ్య‌లో వైద్య ఉద్యోగుల‌ భ‌ర్తీ..

ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?

ITI Limited Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మే 15 ..

రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!