ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?

Healthcare Industry : కరోనా వల్ల ఆరోగ్య శాస్త్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇష్టపడి వృత్తిని చేపట్టే వారికి మంచి అవకాశాలను

ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?
Healthcare Industry
Follow us

|

Updated on: May 11, 2021 | 7:52 AM

Healthcare Industry : కరోనా వల్ల ఆరోగ్య శాస్త్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇష్టపడి వృత్తిని చేపట్టే వారికి మంచి అవకాశాలను అందిస్తుంది. ప్రివెంటివ్ అండ్ డయాగ్నొస్టిక్ సర్వీసెస్, రిహాబిలిటేషన్ థెరపీ, న్యూట్రిషన్ అండ్ డైటరీ సర్వీస్, మేనేజింగ్ హెల్త్ సిస్టమ్స్, మేనేజింగ్ ఫుడ్ సైన్స్, ఇతర ఆరోగ్య సంబంధిత శాఖలలో ఉద్యోగ ఎంపికలు జరుగుతున్నాయి. 21వ శతాబ్దంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించే రంగాలుగా వీటిని చెప్పవచ్చు.

1. ఫిజియోథెరపీ: ప్రతి ఒక్క ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్ట్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కరోనా పాండమిక్ సమయంలో వీరి అవసరం చాలా ఉంది. మానవ్ రచ్నా ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్, ఫిజియోథెరపీలో బాచిలర్స్, మాస్టర్స్ అందిస్తుంది. ఉచిత కమ్యూనిటీ సర్వీస్ హెల్త్ క్యాంప్‌లు, డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ విద్యార్థులకు అనుభవాన్ని పొందడానికి అవసరమవుతాయి. క్లినికల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌ల కోసం ఢిల్లీ ఎన్‌సిఆర్ ఆసుపత్రులతో ఈ విభాగం సంబంధాలు కలిగి ఉంది.

2. న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ : పోషకాహార నిపుణులు ఆహారం, జీవనశైలి, కుటుంబాలు, సంస్థలకు మార్గనిర్దేశం చేస్తారు. బి.ఎస్.సి. & M.Sc చేసిన వారు న్యూట్రిషన్ నిపుణులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ విభాగం ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ (ఐడిఎ), న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

3. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ: ఫుడ్ సైన్స్ ఆరోగ్య శాస్త్రాలతో ముడిపడి ఉంది. ఆహార శాస్త్రవేత్తలు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాలతో కొత్త పదార్ధాలను అధ్యయనం చేస్తారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త ఉత్పత్తులు లేదా సాంకేతికతలను అభివృద్ధి చేస్తారు. బి.ఎస్.సి (హన్స్.) ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు పోషకాహారం, ఆహార ఉత్పత్తి అభివృద్ధి, ఆహార సరఫరా వినియోగ పోకడలు, ఆరోగ్యం పట్ల వైఖరిని ప్రభావితం చేసే అంశాలు, ఆహార విధానం, ఆహారంతో సంబంధం ఉన్న పర్యావరణ సమస్యలను విశ్లేషించడానికి విద్యార్థుల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది.

4. బయోటెక్నాలజీ & మైక్రోబయాలజీ: బయోటెక్నాలజీ & మైక్రోబయాలజీ ఆరోగ్య శాస్త్ర పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రభావితం చేసే జీవ శాస్త్రాలకు సంబంధించిన కోర్సులు. బయోటెక్నాలజీ అనేది పరమాణు స్థాయిలో జీవులను మార్చడం. దీనికి విరుద్ధంగా మైక్రోబయాలజీ ఉంటుంది. అంటే జీవరసాయన శాస్త్రం, జన్యుశాస్త్రం, ప్రోటీమిక్స్, అదృశ్య సూక్ష్మజీవుల పాథోఫిజియాలజీ, ఆహారం, కిణ్వ ప్రక్రియ, ఔషధ, బయోటెక్ పరిశ్రమలను అధ్యయనం చేస్తారు. ఈ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు పరిశోధన, అనువర్తనంలో విస్తారమైన పరిధి ఉంటుంది.

5. దంతవైద్యం: ఆరోగ్య శాస్త్రాలలో మరొక ముఖ్యమైన విభాగం దంతవైద్యం. బాచిలర్స్, మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీలో విద్యార్థులకు దంత శస్త్రచికిత్సలు చేయడానికి గల ఎక్స్పోజర్ ఇవ్వబడుతుంది. ఇటీవల కాలంలో వీరి అవసరం కూడా చాలా పెరిగింది. పెరిగిన జనాభాకు సరిపడ దంత నిపుణలు కచ్చితంగా ఉండాల్సిందే.

Etela Rajender: టీఆర్ఎస్ టార్గెట్‌గా ఈటల అడుగులు.. కొత్త పార్టీపై సమాలోచనలు.. ఆత్మగౌరవ పోరాట వేదికగా ప్రకటించే ఛాన్స్..!

Remdesivir: రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్.. హెటిరో మేనేజరే సూత్రధారి.. లక్షల్లో వ్యాపారం.. చెక్ పెట్టిన నల్లగొండ పోలీస్