ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ మే 15 ..
ITI Limited Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రాయ్‌బరేలిలోని ఈ సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో..
ITI Limited Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రాయ్‌బరేలిలోని ఈ సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 40 పోస్టులకు దరఖాస్తులను కోరుతున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మెకానికల్ విభాగంలో 29 పోస్టులను, ఎలక్ట్రికల్ 07, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 04 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు మించకూడదు.
* ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19, 029 జీతంగా చెల్లిస్తారు.
* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీగా 15.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://www.itiltd.in ను సందర్శించండి.
Also Read: Viral: భారీ నాగపాముతో బామ్మ భయానక ఆటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
INS Airavat: కొనసాగుతున్న ఆపరేషన్ సముద్ర సేతు – 2.. సింగపూర్ నుంచి విశాఖకు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు
King Koti Hospital: కింగ్ కోఠి ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు.. ఆక్సిజన్ అందుబాటులోనే ఉంది: డీఎంఈ