Viral: భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

Snake Viral Video: సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నింటిని ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతారు. అదే సమయంలో..

Viral: భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
Woman With Sanke
Follow us
Ravi Kiran

|

Updated on: May 10, 2021 | 2:18 PM

Snake Viral Video: పాము.. ఈ పేరు వింటేనే ప్రాణం పోయినంత పనౌతుంది. ఆ దరిదాపుల్లో కూడా మనిషి కనిపించడు. కానీ అవ్వ మాత్రం పామును ఈజీగా పట్టుకుని ఏం చేసిందో చూడండి… వామ్మో.! ఈ బామ్మ ధైర్యానికి మొక్కలి..అంత పొడవైన నాగుపాము..ఏ మాత్రం భయం లేకుండా ఎలా పట్టుకుందో చూస్తున్నారుగా. భారీ పొడవైన నాగుపాము తోక పట్టుకుని బరాబరా ఈడ్చుకెళ్లింది. అది చూసిన చుట్టుపక్కల జనాలు, పిల్లలు అరుపులు కేకలు వేస్తున్నారు.

బామ్మ ధైర్యం చూసి అక్కడివారంతా ఓ అవ్వ డేరింగ్‌ లేడీ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు..అయినా అవేవీ పట్టించుకోకుండా ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది. పాపం ఎక్కడ్నుంచి వచ్చింది తెలియదు గానీ, ఈ భారీ నాగుపాము ఇళ్ల మధ్యలోకి వచ్చినట్టుంది. అది గమనించిన వృద్దురాలు..చాకచక్యంగా పామును పట్టుకుని ఇళ్లకు దూరంగా విసిరేసింది.

బెంగళూరు సమీప గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో బామ్మ చేసిన సాహాసం కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. బామ్మ ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజన్లు లైక్లులు, కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!