Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

మానవత్వంతో ఏనుగులు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో..

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Elephant Image
Ravi Kiran

|

May 08, 2021 | 4:43 PM

Elephants Viral Video: భారీ ఆకారం, శక్తి సామర్ధ్యాలు కలిగిన గజరాజు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.! విధ్వంసం చూడాల్సిందే. అయితే వాటికి కూడా మనసు, మానవత్వం ఉందని తాజాగా ఓ సంఘటన నిరూపించింది. మానవత్వంతో ఏనుగులు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ఈరోడ్ జిల్లా సత్యమంగళలోని విలాముండి అటవీప్రాంతం నుంచి కొన్ని ఏనుగులు ఓ గ్రామంలోకి ప్రవేశించి అరటి తోటలో బీభత్సం సృష్టించాయి. 300కి పైగా అరటి చెట్లను నాశనం చేశాయి. ఏనుగుల దాడికి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఇదిలా ఉండగా.. వారు పంట నష్టం అంచనా వేసేందుకు తోటకు వెళ్లి చూడగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒక అరటి చెట్టును తప్ప మిగతా అన్నింటిని ఏనుగులు తొలగించినట్లు గుర్తించారు.

ఎందుకని అక్కడి వెళ్లి చూడగా దానిపైన పక్షి గూడు ఉంది. అందులో అప్పుడే పుట్టిన పక్షి పిల్లలు ఉన్నాయి. వాటిపై ఏనుగులు మానవత్వం చూపించాయి. అందుకే ఆ చెట్టును నాశనం చేయకుండా వెళ్ళిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్వీట్‌ చేసి.. ”పక్షులున్న ఒక చెట్టును తప్పితే మిగతా అన్నింటిని ఏనుగులు నాశనం చేశాయి’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu