King Koti Hospital: కింగ్ కోఠి ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు.. ఆక్సిజన్ అందుబాటులోనే ఉంది: డీఎంఈ
Hyderabad King Koti Hospital: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత
Hyderabad King Koti Hospital: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ముగ్గురు మరణించారని ఆదివారం రాత్రి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. అయితే.. కింగ్ కోఠిలో కరోనా మరణాలు సంభవించాయని పలు మీడియా ఛానెళ్లల్లో వస్తున్న వార్తలపై తెలంగాణ డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ కే రమేశ్ రెడ్డి సోమవారం స్పందించారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ముగ్గురు కరోనా రోగులు చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కోఠి ఆసుపత్రిలో 13 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ఉందని తెలిపారు.
అయితే చనిపోయారంటున్న ఆ ముగ్గురు రోగులు కూడా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని రమేష్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఆసుపత్రికి తగినంత ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతేడాది కాలం నుంచి కూడా ఆసుపత్రిలో కరోనా రోగులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టంచేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులెవరూ చనిపోలేదని స్పష్టంచేశారు. ఇలాంటి వార్తలను చూసి ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని.. ఆ వార్తలు అవాస్తవమని డీఎంఈ రమేశ్ రెడ్డి స్పష్టం అభిప్రాయపడ్డారు.
Also Read: