Wall Collapsed: నిజామాబాద్‌లో విషాదం.. గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
Two workers killed: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎల్లమ్మగుట్ట శివారులో ఈ ఘటన జరిగింది. రైల్వే ప్రహారీ గోడ
Two workers killed: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎల్లమ్మగుట్ట శివారులో ఈ ఘటన జరిగింది. రైల్వే ప్రహారీ గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మురికి కాలువకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గోడకూలి.. శిథిలాలు కూలీలపై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అక్కడ ఉన్నవారు పోలీసులకు, అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న అధికారులు మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొంత కాలం క్రితం కూలీలు పనిచేసేందుకు నిజామాబాద్ వచ్చారు. ఇంతలోనే ఈ సంఘటన జరగడంతో కూలీలంతా ధీనస్థితిలో మునిగిపోయారు.
Also Read: