కరోనాతో పీయూష్ చావ్ల తండ్రి మృతి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన.. పలువురి ఆటగాళ్ల సంతాపం..

Piyush Chawla Father Died : టీమిండియా క్రికెటర్ పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో మృతిచెందారు.

కరోనాతో పీయూష్ చావ్ల తండ్రి మృతి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన.. పలువురి ఆటగాళ్ల సంతాపం..
Piyush Chawla Father Died
Follow us

|

Updated on: May 10, 2021 | 2:49 PM

Piyush Chawla Father Died : టీమిండియా క్రికెటర్ పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్‌కి గురైన ఆయన చికిత్స తీసుకుంటూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, అభిమానులు పీయూష్ చావ్లాకు సంతాపం ప్రకటిస్తున్నారు.

ఈ రోజు తన మూల స్తంభాన్ని కోల్పోయా అని పీయూష్ చావ్లా ట్వీట్ చేశాడు. ‘ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. నా ప్రియమైన నాన్న మిస్టర్ ప్రమోద్ కుమార్ చావ్లా ఈ రోజు చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మీరు ఇచ్చిన మద్దతు మరువలేనిది. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించాడు.

32 ఏళ్ల లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయినప్పటికీ అతను 2012 నుండి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగమైన పియూష్ చావ్లాను గత ఫిబ్రవరి వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి కూడా కరోనాకు బలైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడిన సకారియా తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరిన సకారియా తన తండ్రిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు.

Viral: భారీ నాగపాముతో బామ్మ భయానక ఆటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

Viral Video: పరుగో పరుగు.! గజరాజులను చూసి భయంతో లగెత్తిన సింహాలు.. వైరల్‌ వీడియో..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి