జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత్.. స్పష్టం చేసిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ
India Will Tour Sri Lanka : జూలై 2021లో మూడు వన్డేలు, ఐదు టి 20ల సిరీస్ కోసం భారత్.. శ్రీలంకలో పర్యటిస్తుందని బిసిసిఐ అధ్యక్షుడు
India Will Tour Sri Lanka : జూలై 2021లో మూడు వన్డేలు, ఐదు టి 20ల సిరీస్ కోసం భారత్.. శ్రీలంకలో పర్యటిస్తుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. భారతదేశపు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మిగిలిన ఐపిఎల్ 2021 ఆడే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు “లేదు మూడు వన్డేల కోసం భారతదేశం శ్రీలంకకు వెళ్లాల్సి ఉందని బదులిచ్చాడు. ఈ సందర్భంగా జూన్-జూలైలో దేశీయ ఆటగాళ్లందరికీ పరిహారం ఇస్తామని తెలిపాడు. బిసిసిఐ మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడం లేదని అభిప్రాయం తప్పు అని కొట్టిపారేసారు. ఇప్పట్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగవు.
కరోనాను ఎదిరించి నిర్వహించడం చాలా కష్టమని తెలిపాడు. ఐపిఎల్ 2021 మిగిలిన భాగం భారతదేశంలో జరగదని గంగూలీ చెప్పారు. ఐసిసి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (ఎఫ్‌టిపి) ప్రకారం.. జూలైలో భారత్ మూడు టి 20 మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుందని స్పష్టం చేశారు. అయితే ఈసారి జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. జట్టు రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ పర్యటనలో ఉంటారు. పృథ్వీ ఓపెనర్‌గా అతనితో పాటు బరిలోకి దిగుతాడు. అలా కాకుండా యువ కర్ణాటక బ్యాట్స్‌మన్ దేవదత్ పద్దికల్, మహారాష్ట్ర ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా జట్టులో అవకాశం పొందవచ్చు.
భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, మనీష్ పాండే, సంజు సామ్సన్ ఎంపికలున్నాయి. ఫైనల్ 11 లో వీరిలో ఎవరికి అవకాశం లభిస్తుందో తెలియడం కష్టం. ఇంగ్లాండ్ పర్యటనలో భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం రాలేదు. అటువంటి దృష్టా అతను శ్రీలంక పర్యటనకు వెళ్లడం దాదాపు ఖాయం. అతను కెప్టెన్సీకి పోటీదారుడు కూడా కావచ్చు.