Flash: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ బంద్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..

Covid Vaccination In AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజులు(ఇవాళ, రేపు) వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏపీ...

Flash: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ బంద్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..
Covid Vaccination
Follow us
Ravi Kiran

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 11:38 AM

Covid Vaccination In AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజులు(ఇవాళ, రేపు) వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపి వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇకపై వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర జనం గుమిగూడితే అధికారులపై చర్యలు తీసుకోనుంది. ఇదిలా ఉంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారాన్ని స్లిప్పుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండో డోసు పూర్తయ్యేకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. తాజాగా గత 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22,164 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇవీ చదవండి:

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!