Medical Staff Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఖాళీ పోస్టుల భర్తీ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త... కొత్తగా 35 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు. కోవిడ్ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది.

Medical Staff Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఖాళీ పోస్టుల భర్తీ  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు నోటిఫికేషన్
Secunderabad Cantonment Board Covid Hospital
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2021 | 11:37 AM

Recruitment of Medical Staff: నిరుద్యోగులకు శుభవార్త… కొత్తగా 35 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ఆస‌క్తి క‌లిగిన‌ అభ్యర్థలు సంబంధిత ఈ మెయిల్ ద్వారా ఈనెల 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 35 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైన‌వారిని ఒప్పంద ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తుంది.

మొత్తం పోస్టులు: 35 పోస్టులుః జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి, న‌ర్సింగ్ స్టాఫ్ త‌దిత‌ర పోస్టులు ఉన్నాయి. అర్హత‌ః స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, జీఎన్ఎం లేదా బీఎస్సీ (న‌ర్సింగ్‌), ఎంబీబీఎస్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభ‌వం త‌ప్పనిస‌రి. ద‌ర‌ఖాస్తు విధానంః ఈ మెయిల్ ద్వారా (ceo.seb2009@gmail.com) ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీః మే 17 వెబ్‌సైట్‌ః https://secunderabad.cantt.gov.in/