కఠిన లాక్ డౌన్ వేళ , వీధికుక్కలు, పశువులకు ఆహారం కోసం రూ. 60 లక్షలు మంజూరు చేసిన ఒరిశా సీఎం నవీన్ పట్నాయక్
14 రోజుల లాక్ డౌన్ సమయంలో మనుషులకే కాదు,జంతువులకూ ఆహార కొరత తప్పడంలేదు. మూగజీవులు ఫుడ్ కోసం విలవిలలాడుతుంటాయి. బహుశా ఇందుకే ఒరిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
14 రోజుల లాక్ డౌన్ సమయంలో మనుషులకే కాదు,జంతువులకూ ఆహార కొరత తప్పడంలేదు. మూగజీవులు ఫుడ్ కోసం విలవిలలాడుతుంటాయి. బహుశా ఇందుకే ఒరిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీధికుక్కలు, పశువుల ఆహారం కోసం రూ. 60 లక్షలు మంజూరు చేశారు. ఈ మూగజీవుల ఆకలి బాధ తీర్చేందుకు సీఎం ఉదారంగా ఈ సొమ్మును మంజూరు చేశారని ఓ అధికారి తెలిపారు. అయిదు మున్సిపల్ కార్పొరేషన్లు, 48 మున్సిపాలిటీలు, 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ లో ఈ నిధులను వినియోగించనున్నట్టు ఆయన చెప్పారు. వివిద స్వచ్చంద సంస్థల ద్వారా జంతువులకు ఫుడ్ అందిస్తున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. జైపూర్ జిల్లాలోని మహావినాయక్ ఆలయ అధికారులు నిన్న కోతులు, కుక్కలు, ఆవులు, గేదెలకు ఆహారాన్ని అందజేశారు. స్థానికులు కూడా దయార్ద్ర హృదయంతో వీటికి ఆహారాన్ని ఇచ్చేందుకు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ఒడిశాలో గత 24 గంటల్లో 11,987 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 21 మంది రోగులు మృతి చెందారు. ఒక్క కటక్ జిల్లాలోనే సుమారు 11 వందల కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
కాగా ఇండియాలో కోవిడ్ కేసులు గత నాలుగైదు రోజులతో పోలిస్తే సోమవారం కొంత తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 403,738 కేసులు నమోదయ్యాయని, 4,092 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ నెల 8 న 20 లక్షలమందికి పైగా టీకామందు తీసుకున్నారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని ఈ శాఖ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి తగ్గాలంటే పెద్దఎత్తున వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఫాసీ మళ్ళీ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇండియా యుధ్ధ ప్రాతిపదికన ఇందుకు చర్యలు తీసుకోవాలని ని ఆయన సూచించారు. మరిన్ని చదవండి ఇక్కడ : Vijay Deverakonda Liger teaser postponed:విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. లైగర్ టీజర్ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో) ఐసొలేషన్ లో సింహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? జంతువులను సైతం వదలని కరోనా మహమ్మారి: Lions viral video.